ఆదివారం, ఏప్రిల్ 26, 2015

పరువం వానగా...

మణిరత్నం ఏ.ఆర్.రెహ్మాన్ ల ఫస్ట్ క్లాసిక్ రోజా సినిమాలోని ఒక అద్భుతమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి.


చిత్రం : రోజా (1992)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, సుజాత

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదివే నీవైతే అలనేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లొ తేలనీ నీ గుండెలొ నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లొ కొలువుండనీ

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే

నీ గారాల చూపులే నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకొ

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే
నదివీ నీవైతే అలనేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
 


1 comments:

మంచు లోయల్లో మనసైన వారితో ఉంటే అంతేగా మరి..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.