మంగళవారం, ఏప్రిల్ 14, 2015

జాబిల్లి కోసం ఆకాశమల్లే...

మంచి మనసులు చిత్రం కోసం ఇళయరాజా గారి స్వరకల్పనలో జానకి గారు పాడిన ఈ పాట ఎందుకో సేం ట్యూన్ అయినా బాలు గారి వర్షన్ అంత ఫేమస్ కాలేదు కానీ బాగుంటుంది. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : మంచి మనసులు (1985)
సంగీతం :  ఇళయరాజా
సాహిత్యం :  ఆచార్య ఆత్రేయ
గానం :  జానకి

లాలాలాల... లాలాలలాలా...లాలా..లాలా..
లాలాలాల... లాలాలలాలా...లాలా..లాలా..

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
 
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనే లేను...

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

 
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో..
ఈ వెల్లువలో ఎమవుతానో
ఈ వేగంలో ఎటుపోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను ఒడిచేర్చుతావో
నట్టేట ముంచి నవ్వేస్తావో..

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై..


1 comments:

పాటలెన్ని ఉన్నా, ఇదెప్పుడూ నా ఆల్ టైం ఫేవరెట్ సాంగ్ వేణూజీ..థాంక్యూ సో సో మచ్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail