శుక్రవారం, ఏప్రిల్ 03, 2015

మధుమాస వేళలో...

సత్యం గారి స్వరకల్పనలో బాలు గారు చేసిన మ్యాజిక్ ఏంటో ఈ అందమైన పాట విని మీరే తెలుసుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


సినిమా : అందమె ఆనందం (1977)
సంగీతం : సత్యం
రచన : దాశరధి
గానం : ఎస్.పి.బాలు

మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో
మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో
మనసైన చిన్నదీ.. లేదేలనో
మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో
ఆఆ..ఆఆఆ..ఆహా..ఆఆఆఆ..ఆఆఆ

ఆడింది పూల కొమ్మ.. పాడింది కోయిలమ్మ
అనురాగ మందిరంలో కనరాదు పైడిబొమ్మ
ప్రణయాలు పొంగే వేళా.. ఆఆఆ..ఆఆ..ఆ
ప్రణయాలు పొంగే వేళా నాలో రగిలే ఎదో జ్వాల

మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో
 
ఉదయించె భానుబింబం.. వికసించలేదు కమలం
నెలరాజు రాక కోసం వేచింది కన్నె కుముదం
వలచింది వేదనకేనా..ఆఆఆ..ఆఆ..
వలచింది వేదనకేనా జీవితమంతా దూరాలేనా..

మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో
మనసైన చిన్నది.. లేదేలనో
మధుమాస వేళలో.. మరుమల్లె తోటలో


1 comments:

బాలూ గారి గొంతులో తేనెలొలికిన విరహంపు పాట..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail