సోమవారం, ఏప్రిల్ 27, 2015

నీమది పాడెను ఏమని...

ప్రకృతిలోని ప్రతి అణువూ తమ ప్రేమ గురించే మాటాడుకుంటుందనుకుంటూ పాడుకుంటున్న ఈ ప్రేమజంటను చూసొద్దామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : నిత్యకళ్యాణం పచ్చతోరణం (1960)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : పి.బి.శ్రీనివాస్, సుశీల

నీమది పాడెను ఏమని 
నిజానికి నీవే నేనని
నీమది పాడెను ఏమని 
నిజానికి నీవే నేనని

తీయని మనసుల వీణలు మీటి 
తుమ్మెద ఏమనె పూవులతోటీ
తీయని మనసుల వీణలు మీటి 
తుమ్మెద ఏమనె పూవులతోటీ
చెలిమికి సాటియె లేదనెను 
విభేదము వలపున రాదనెను 

నీమది పాడెను ఏమని 
నిజానికి నీవే నేనని
నీమది పాడెను ఏమని 
నిజానికి నీవే నేనని

చల్లగ సాగుతు జీవిత నౌక 
మెల్లగ ఏమనె ప్రేమిక 
చల్లగ సాగుతు జీవిత నౌక 
మెల్లగ ఏమనె ప్రేమిక 
ఇరువురినొకటే కోరమనె
ఆ కోరిన తీరమూ చేరమనె

నీమది పాడెను ఏమని 
నిజానికి నీవే నేనని
నీమది పాడెను ఏమని 
నిజానికి నీవే నేనని

గూటికి చేరుచు గువ్వల జంట 
గుస గుస లాడెను ఏమని మింట 
గూటికి చేరుచు గువ్వల జంట 
గుస గుస లాడెను ఏమని మింట 
తమవలె మనమూ ఏకమనే 
మన ప్రేమయె మనకూ లోకమనే

నీమది పాడెను ఏమని 
నిజానికి నీవే నేనని
ఆఆఆఆ..ఆఆఆ..ఆఆఅ...1 comments:

మనసు ఆనందం గా ఉంటే నిజంగానే ప్రతీదీ అందం గా కనిపిస్తుంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.