సోమవారం, సెప్టెంబర్ 29, 2014

శ్రీ లలితా శివజ్యోతీ...

ఈ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. ఈరోజు దద్ద్యోజనం లేదా పెరుగు గారెలు నైవేద్యంగా పెట్టాలంటారు. ఈ సందర్బంగా రహస్యం సినిమాలోని ఈ పాటను తలచుకొందామా. లీల గారి గొంతులో ఖంగుమంటూ మోగే ఈ పాట వినని, తెలియని తెలుగు వారు ఉండరేమో. ఈ పాట ఆడియో కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : రహస్యం (1967)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : మల్లాది రామకృష్ణ శాస్త్రి
గానం : పి.లీల

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీవశమై స్మరణే జీవనమై
మనసే నీవశమై స్మరణే జీవనమై
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా

అందరికన్న చక్కని తల్లికి సూర్యహారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళగా జ్యోతుల కప్పురహారతి
సకలనిగమ వినుతచరణ శాశ్వత మంగళహారతి

శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా
శ్రీగిరినిలయా గిరామయా సర్వమంగళా
శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా 

2 comments:

ఇంటికి దీపం ఇల్లాలంటారు..మరి అటువంటి స్త్రీమూర్తులందరికీ మాతృస్వరూపిణి,ఆ పరమశివుని ఇల్లాలు ఐన లలితామ్మవారిని శివజ్యోతి అనడం మల్లాదిగారికే చెల్లింది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.