బుధవారం, సెప్టెంబర్ 10, 2014

కో అంటే కోయిలమ్మ...

రేడియో పరిచయం చేసిన పాటలలో నాకు నచ్చిన మరో పాట ఇది. చిన్నపుడు చాలా సరదాగా ఉండేది వినడానికి పాటతో పాటు పాడుకుంటూ భలే ఎంజాయ్ చేస్తూ వినేవాడ్ని ఈ పాటను. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : తూర్పు వెళ్ళే రైలు (1979)
సంగీతం : బాలు
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

కో అంటె కోయిలమ్మ కోకో.. 
కో అంటె కోడిపుంజు కొక్కరకో
కో అంటె కోయిలమ్మ కోకో.. 
కో అంటె కోడిపుంజు కొక్కరకో
కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో..
కో కాసుకో...

కో అంటే కోయిలమ్మ కోకో.. 
కో అంటె కోడిపుంజు కొక్కరకో

కోటేరు పట్టినోడికో.. పూట కూడు దక్కదెందుకో
నారు నీరు పోసినోడుకో.. శేరు గింజలుండవెందుకో
అన్నం ఉండదొకడికి తిన్నదరగదొకడికి
ఆశ చావదొకడికి ఆకలారదొకడికీ

కో కాసుకో...
కో అంటే కోయిలమ్మ కోకో.. 
కో అంటె కోడిపుంజు కొక్కరకో

మేడిపండు మేలిమెందుకో.. 
పొట్ట ఇప్పి గుట్టు తెలుసుకో
చీమలల్లే కూడబెట్టుకో.. 
పాములొస్తే కర్రపట్టుకో కో..
పాములొస్తే కర్రపట్టుకో కో..ఒ..ఒ..
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
వేమన్న వేదాలు చెపుతా రాసుకో.. రాసుకో... కో కాసుకో

కో అంటే కోయిలమ్మ కోకో 
కో అంటె కోడిపుంజు కొక్కరకో

తూరుపింటి ఆంకాళమ్మ కో... కో ...
పడమటింటి పోలేరమ్మ కొక్కో...
దక్షిణాన గంగానమ్మ కో.. కో ..
ఉత్తరాన నూకాలమ్మ కొక్కరకో
కో.. అంటే కోటిమంది అమ్మతల్లులున్నా
పంట చేను కాపలాకు నేను ఎందుకో .. కో... కాసుకో ...

కో అంటే కోయిలమ్మ కోకో.. 
కో అంటె కోడిపుంజు కొక్కరకో
కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో.. 
 
 

2 comments:

ఓ పక్క హీరో మై మరిచి పాడుకుంటుంటే మరో పక్క నించి దొంగలు పంటంతా కోసుకెళ్ళిపోతారీ పాటలో..భలె సరదా అయిన పాటండీ..

ఓహ్ ఈ పాట వీడియో నేనెపుడూ చూడలేదండీ... వినడానికి కూడా మాంచి సరదాగా ఉండే పాట ఇది.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.