మంగళవారం, సెప్టెంబర్ 30, 2014

నమస్తేస్తు మహా మాయే...

ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిచ్చే రోజు. నైవేద్యంగా రవ్వకేసరీ లేదా పెసర పునుగులు సమర్పించాలని అంటారు. నేడు 'శ్రీదేవీ మూకాంబిక' చిత్రంలోని ఈ మహాలక్ష్మి అష్టకాన్ని గుర్తు చేసుకుందామా. కన్నడలోని కొల్లుర శ్రీ మూకాంబిక అనే చిత్రానికి అనువాదమే ఈ సినిమా. ఇందులో ఈపాట చిత్రీకరణ బాగుంటుంది ముఖ్యంగా అమ్మవారిని స్థుతించే బాలవటువు అభినయంం అద్భుతం.   చిత్రం : శ్రీదేవీ మూకాంబిక (1993) సంగీతం : పుహళేంది.మహదేవన్ సాహిత్యం : ఆదిశంకరాచార్య - మహాలక్ష్మి...

సోమవారం, సెప్టెంబర్ 29, 2014

శ్రీ లలితా శివజ్యోతీ...

ఈ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. ఈరోజు దద్ద్యోజనం లేదా పెరుగు గారెలు నైవేద్యంగా పెట్టాలంటారు. ఈ సందర్బంగా రహస్యం సినిమాలోని ఈ పాటను తలచుకొందామా. లీల గారి గొంతులో ఖంగుమంటూ మోగే ఈ పాట వినని, తెలియని తెలుగు వారు ఉండరేమో. ఈ పాట ఆడియో కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : రహస్యం (1967) సంగీతం : ఘంటసాల సాహిత్యం : మల్లాది రామకృష్ణ శాస్త్రి గానం : పి.లీల శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా...

ఆదివారం, సెప్టెంబర్ 28, 2014

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా...

ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు. చిల్లుల్లేని అల్లం గారెలు లేదా మినప సున్నుండలు నైవేద్యంగా పెట్టాలని అంటారు. ఈ సందర్బంగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో సుశీల గారు పాడిన ఈ చక్కని పాటను తలచుకొందామా. తనువులోని ఐదు అంశలు నింగీ, నేలా, నీరు, నిప్పు, గాలి నీ సేవకే ఉపయోగించాలనుంది అని చెప్తూ రామబ్రహ్మం గారు రాసిన ఈపాట చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఈ ఆల్బమ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఆల్బమ్ :  ఉమాశంకర స్తుతిమాల...

శనివారం, సెప్టెంబర్ 27, 2014

శివ మనోరంజని...

శరన్నవరాత్రులలో ఈ రోజు అమ్మవారు సకల వేదస్వరూపిణి అయిన గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తారు. కొబ్బరి పాయసం లేదా కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలని అంటారు. ఈ సందర్బంగా గాయత్రీ మాత శ్లోకాన్ని విందామా. 'రహస్యం' సినిమాలో ఎస్వీరంగారావు గారి అభినయంలో ఘంటసాల గారి గాత్రంలో ఉన్న ఈ శ్లోకం వినడానికి చూడడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందునిభద్దరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా...

శుక్రవారం, సెప్టెంబర్ 26, 2014

దేవీ త్రిభువనేశ్వరీ...

ఈరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు. చిత్రాన్నము లేదా పులిహోర నైవేద్యముగా సమర్పించి పూజించుకునే రోజు. ఈసందర్బంగా మధురమీనాక్షి చిత్రంలోని దేవీ త్రిభువనేశ్వరి అనే ఈ పాటను తలచుకొందామా. ఊయలలో ఉన్న బాలని సాక్షత్ లక్ష్మీ సరస్వతులు ఆటపాటలతో అభివర్ణించే అపురూపమైన ఘట్టమిది. ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : మధురమీనాక్షి (1989) సంగీతం : ఎమ్మెస్ విశ్వనాధన్ సాహిత్యం : రాజశ్రీ గానం...

గురువారం, సెప్టెంబర్ 25, 2014

అంబికా నర్తనం...

ఈ రోజు నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా ఈ తొమ్మిది రోజులు దేవీ అవతారాలను తలచుకుంటూ అందుకు సంబంధించిన పాటలను గుర్తు చేసుకుందామా... మిత్రులందరకూ శరన్నవరాత్రి శుభాభినందనలు. నేడు మొదటి రోజు స్వర్ణకవచాలంకృతా దేవి అవతారం. ఆ దేవికి కనకకవచాన్ని అలంకరించి కట్టు పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించి పూజించే రోజు. ఈరోజు పరాశక్తి మహిమలు సినిమాలోని అంబికా నర్తనం అనే ఈ పాటను గుర్తు చేసుకుందాం. శ్రావ్యమైన సంగీతంతో చక్కని చిత్రీకరణతో కూడిన ఈ పాట మీరూ చూసీ...

బుధవారం, సెప్టెంబర్ 24, 2014

సకల కళా వల్లభుడా...

ప్రేమ, పెళ్ళి అంటే తనకి అసహ్యమంటూనే చివరికి ఒక డాక్టర్ ను ప్రేమించి పెళ్ళి చేసుకునే పాత్రలో ఆద్యంతం హాస్యాన్ని పండించిన కమల్ హాసన్ 'బ్రహ్మచారి' సినిమాకి పెద్ద ఎసెట్. పూర్తిగా హాస్యం మీదే ఆధారపడి నడిచే ఈ సినిమాలోని ఈ ప్రేమగీతం నాకు నచ్చిన పాటలలో ఒకటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : బ్రహ్మచారి (2002) సంగీతం : దేవా రచన : శివ గణేష్ గానం : శ్రీనివాస్, సుజాత సకల కళా వల్లభుడా సరసం కోరే...

మంగళవారం, సెప్టెంబర్ 23, 2014

What a waiting...

"అందమైన అనుభవం" సినిమా కోసం బాలచందర్ గారు సింగపూర్ లోని జురాంగ్ బర్డ్ పార్క్ లో చిత్రీకరించిన ఈపాట చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే గిటార్ పై లైట్ గా సాగే సంగీతం మనసుకు హాయైన అనుభూతిని ఇస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అందమైన అనుభవం (1979) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం: బాలు What a waiting What...

సోమవారం, సెప్టెంబర్ 22, 2014

ఏమిటిది ఏమిటిది...

బాలు గారు స్వరపరచిన అతికొద్ది సినిమాలలో ఒకటైన "తూర్పు వెళ్ళే రైలు" లో ఒక అందమైన మెలోడీ ఈ రోజు మీకోసం. ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. వాటిలో ప్రత్యేకించి ఈ పాటను సుశీల గారు పాడిన విధానం అద్భుతం. టీనేజ్ లో ఈ పాట వినడం ఒక మధురమైన అనుభూతి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : తూర్పు వెళ్ళే రైలు (1979)  సంగీతం : బాలు  సాహిత్యం : ఆరుద్ర  గానం : సుశీల    ఏమిటిది ఏమిటిదీ...

ఆదివారం, సెప్టెంబర్ 21, 2014

గుడిగంటలా నవ్వుతావేలా...

ఆర్పీ పట్నాయక్ చేసిన మెలోడీలలో ఒక మంచి పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఔనన్నా కాదన్నా (2005) సంగీతం : ఆర్.పి.పట్నాయక్ రచన : కులశేఖర్ గానం : ఎస్.పి.బి.చరణ్ , ఉష గుడిగంటలా నవ్వుతావేలా తెలియదు నాకు తెలియదు జడగంటలా ఊగుతావేలా తెలియదు నాకు తెలియదు అసలేంటి సంగతి ఓ బాలా తెలియదు తెలియదు తెలియదు తెలియదులే గుడిగంటలా నవ్వుతావేలా తెలియదు నాకు తెలియదు జడగంటలా ఊగుతావేలా తెలియదు...

శనివారం, సెప్టెంబర్ 20, 2014

చెలియా చెలియా...

దేవీశ్రీప్రసాద్ పాటలలో ఇలాంటి జానపదం టచ్ ఉన్న పాటలది ఒక ప్రత్యేకమైన స్థానం. కలుసుకోవాలని సినిమా కోసం చేసిన ఈపాట నాకు మూడ్ స్వింగ్స్ లో ఉన్నపుడు హుషారు తెప్పించడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరూ విని చూసీ ఎలా ఉందో చెప్పండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : కలుసుకోవాలని (2002) సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : కులశేఖర్   గానం : దేవీశ్రీప్రసాద్, కల్పన చెలియా చెలియా సింగారం  చిటికెడు...

శుక్రవారం, సెప్టెంబర్ 19, 2014

అనగా అనగనగా...

ఈమధ్య విడుదలైన కొత్త పాటలలో విన్నవెంటనే ఆకట్టుకున్న సరదా ఐన పాట ఇది. ఈ సినిమా కూడా నాకు చాలా బాగా నచ్చింది. "ప్రస్థానం" సినిమాలో సీరియస్ రోల్ తో ఆకట్టుకున్న శర్వానంద్ ఈ సినిమాలో పూర్తి స్థాయి కామెడీ రోల్ తో ఆకట్టుకున్నాడు. ఇందులో తన డ్రెస్సింగ్ తో మొదలుకొని డాన్స్ వరకూ అంతా చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. కలర్ ఫుల్ గా మంచి ఎంటర్ టైనింగ్ గా చక్కని రిధమ్ తో సాగిన ఈ పాట చూసీ వినీ మీరూ ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం...

గురువారం, సెప్టెంబర్ 18, 2014

సరిగమలు గలగలలు...

ఈ బ్లాగ్ పేరుకి ప్రేరణగా నిలచిన పాటని నేనింతవరకూ పోస్ట్ చేయలేదని చూసుకుని ఆశ్చర్యపోయాను. బాలచందర్ గారి సినిమాల్లో ఎమ్మెస్ విశ్వనాథన్ గారు స్వరపరచే అన్నిపాటలు బాగుంటాయి. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ మరోసారి తలచుకోండి. ఈ పాట వీడియో చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఇది కథ కాదు (1979) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : బాలు, సుశీల సరిగమలూ...

బుధవారం, సెప్టెంబర్ 17, 2014

ఉండాలీ నీ గుండెల్లో...

ఈ బ్లాగులో తరచుగా నాకు రేడియో పరిచయం చేసిన పాటలంటూ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, అలాగే ఈ పాట నాకు టీవీ పరిచయం చేసిన పాట. టీవీ అంటే దూరదర్శన్ ఛానల్స్ మాత్రమే అందుబాటులో ఉన్న తొలిరోజుల్లో ప్రతి గురువారం రాత్రి ఎనిమిదింటికి చిత్రలహరి ప్రోగ్రాం వచ్చేది అందులో ఈ పాట కొంతకాలం రెగ్యులర్ గా వచ్చేది. మొదటిసారి అక్కడ చూసే అభిమానించాను. నాకు నచ్చిన ఈ మెలోడీని మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు....

మంగళవారం, సెప్టెంబర్ 16, 2014

గోపాల కృష్ణుడు నల్లనా...

ఈ రోజు వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్బంగా మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కన్నయ్య పాటను తలచుకుందామా. రావుబాలసరస్వతి గారు పాడిన ఈపాట చాలా చాలా బాగుంటుంది. ఈ క్రింది ప్లగిన్ లోడ్ అవకపోతే ఈపాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రాధిక (1947)  సంగీతం : సాలూరి హనుమంతరావు సాహిత్యం : సదాశివబ్రహ్మం గారు గానం : రావు బాలసరస్వతి  గోపాల కృష్ణుడు నల్లనా గోకులములో పాలు తెల్లనా కాళిందిలో...

సోమవారం, సెప్టెంబర్ 15, 2014

ఎపుడెపుడెపుడని...

నిర్ణయం సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఈ పాట నాకు చాలా ఇష్టం. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : నిర్ణయం (1991) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, జానకి ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...   ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం...

ఆదివారం, సెప్టెంబర్ 14, 2014

చిన్నదానా ఓసి చిన్నదానా...

ప్రేమకథా చిత్రాలలో చూడకుండా ప్రేమించుకోవడమనే ఒక కొత్త ట్రెండ్ కు తెర తీసిన 'ప్రేమలేఖ' సినిమాలో హుషారుగా సాగే ఈ పాట చాలా బాగుంటుంది. దేవా హాయైన ట్యూన్ కి భువనచంద్ర గారి సరదా లిరిక్స్ తోడై మంచి వినోదాన్ని పంచుతాయి. చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ప్రేమలేఖ (1996) సంగీతం : దేవా సాహిత్యం : భువనచంద్ర గానం...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.