శనివారం, ఆగస్టు 30, 2014

నిదురించే తోటలోకి

నాకు రేడియో పరిచయం చేసిన అద్భుతమైన పాటలలో ఇదీ ఒకటి... పాట మొదలవగానే ఏ పని చేస్తున్నా కూడా ఎక్కడివక్కడ ఆపేసి మరీ వినేవాడ్ని. సుశీల గారు పాడిన ది బెస్ట్ సాంగ్స్ లో ఇదీ ఒకటనవచ్చునేమో. మహదేవన్ గారి సంగీతం శేషేంద్రశర్మ గారి సాహిత్యం సుశీలమ్మగారి గాత్రం కలిసిన ఈ పాట విన్నవెంటనే మనసులో చెరగని చోటు సంపాదించేసుకుంటుంది. మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : గుంటూరు శేషంధ్రశర్మ
గానం : సుశీల

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసింది

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకు పోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని
నావకు చెప్పండీ నావకు చెప్పండి

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది


4 comments:

యెంత అందమైన పాట..యెప్పుడో వీడిపోయిన భర్త అనుకోకుండా కనిపిస్తే ఆ ఇల్లాలి మదిలో కదిలే కన్నీటి జ్ఙాపకాలకి అక్షర రూపమీ పాట..

అవును శాంతి గారు.. చాలా చక్కని పాట. థాంక్స్ ఫర్ ద కామెంట్.

it's a great song..................thank you so much......!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail