ఆదివారం, ఆగస్టు 10, 2014

అందాల పసిపాప...

ఈరోజు రాఖీ సంధర్బంగా మిత్రులందరకూ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్బంగా చిట్టి చెల్లెలు సినిమా కోసం సాలూరి వారి స్వరకల్పనలో దాశరథి గారు రచించిన ఈ పాట గుర్తు చేసుకుందామా... నాకు చాలా ఇష్టమైన పాట ఇది. అన్నా చెల్లెళ్ళ పాటలు అనగానే మొదట గుర్తొచ్చే ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల

అందాల పసిపాప .. అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి .. నేనున్నది నీ కొరకే .. నీకన్నా నాకెవరే
అందాల పసిపాప ..అన్నయ్యకు కనుపాప


ఆ చల్లని జాబిలి వెలుగు .. ఆ చక్కని చుక్కల తళుకు
ఆ చల్లని జాబిలి వెలుగు .. ఆ చక్కని చుక్కల తళుకు
నీ మనుగడలో నిండాలమ్మా ..
నీ మనుగడలో నిండాలమ్మా .. నా కలలన్ని పండాలమ్మా

అందాల పసిపాప .. అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి .. నేనున్నది నీ కొరకే .. నీకన్నా నాకెవరే
అందాల పసిపాప ..అన్నయ్యకు కనుపాప


మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
మన తల్లే దైవముగా కలకాలం కాపాడునులే
తోడై నీడై లాలించునులే
తోడై నీడై లాలించునులే .. మనకే లోటు రానీయదులే

అందాల పసిపాప .. అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయి .. నేనున్నది నీ కొరకే .. నీకన్నా నాకెవరే
అందాల పసిపాప ..అన్నయ్యకు కనుపాప
ల ల లాలి ..ల ల లాలి
ల ల లాలి ..ల ల లాలి


2 comments:

ఫైవ్ యియర్స్ బాక్ వరకు మా తమ్ముడే కాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా రాఖీలు పోస్ట్ చేసేదాన్నండీ..ప్రస్తుతం తమ్ముడొక్కడికే కడుతున్నా..మా వాడితో పాటు వాళ్లందరూ కూడా యెక్కడ వున్నా సక్సెస్ ఫుల్ గా, సంతోషంగా వుండాలని, వుంటారనీ నా ఆకాంక్ష..

థాంక్స్ శాంతి గారూ... మీ ఆకాంక్ష బాగుందండీ.. నేనూ అది నెరవేరాలని కోరుకుంటున్నా..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail