శనివారం, ఆగస్టు 23, 2014

జల్లంత కవ్వింత కావాలిలే..

వర్షాన్ని మణిరత్నం గారు ఉపయోగించుకున్నంతగా మరెవ్వరూ ఉపయోగించుకోలేరేమో... హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ లో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి లోని ఈ పాటంటే నాకు చాలా ఇష్టం... ఇప్పటికీ వింటూంటే సినిమా విడుదలైన రోజులలో టీనేజ్ లో ఎంత పిచ్చిగా ఎంజాయ్ చేశామో గుర్తొస్తూ ఉంటాయ్. బహుశా ఈ పాటని ఇష్టపడని తెలుగు వాళ్ళుండరేమోలెండి.. మీరూ మరోసారి గుర్తుచేసుకుని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర

జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

వాగులు వంకులు గలగలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లె తేనె రెక్క ముద్దులాడి
వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి 
 
జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
 
  సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి మంచులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా
నీలికొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో ఒహో

జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే 
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులో పరుగులో
ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే 
హే.. ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే 



0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail