మంగళవారం, ఆగస్టు 19, 2014

ఒకే కావ్యం...

వర్ణ సినిమాలోని నాకు నచ్చిన ఒక మంచి పాట ఇది... చిత్రీకరణ కూడా బాగుంటుంది.. వేరే ప్రపంచం అంటూ చిత్రీకరించిన సీన్స్ కొన్ని అందంగా ఉంటాయి... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : వర్ణ (2013)
సంగీతం : హారీస్ జయరాజ్
రచన : చంద్రబోస్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఒకే కావ్యం ఒకే శిల్పం ఒకే చిత్రం అదే ప్రణయం
మన తనువు మారును తరము మారును
స్వరము మార్చదు ప్రేమా
ప్రేమా మరణం..
ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండూ ఉండాలి
 
ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం కోసం రెండూ ఉండాలే
ఒకే కావ్యం ఒకే శిల్పం ఒకే చిత్రం అదే ప్రణయం

తనువులేకం కాకముందు మనసులౌను ఏకమే
తనువు తనువుకి ప్రాణద్వారం ప్రేమే..
ఎదలు రెండూ దూరమైనా పెదవులౌను చేరువే
పెదవిద్వారా ఎదను చేరును ప్రేమే
ముల్లు లాంటి కళ్ళతోటి అంతుచూస్తుంది
పువ్వులాంటి నవ్వుతోటి ఆయువిస్తుందీ

ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండూ ఉండాలి
ప్రేమా మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి
ఆ స్వర్గం కోసం రెండూ ఉండాలి

ప్రేమ పాట పాతదీ పూట పూట కొత్తది
గాలి లేని చోటైనా మోగేనిదీ.. 
ప్రేమ అంటే విషములే విషములోని విశేషమే 
ఇదేజన్మలో మరోజన్మకు మార్గమే 
బీడు భూమిలొ మెట్ట భూమిలొ మొగ్గ ప్రేమేలే 
మండుటెండలొ ఎండమావిలొ నీడ ప్రేమేలే

భళాచాంగు భళాచాంగు భళాచాంగు భళా
మా ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళా
ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళా
నిన్ను స్మరిస్తేనే నాలో స్వర్ణకళా.. 
తరంగంలా మృదంగంలా
రావే రావే విరంగంలా


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail