ఆదివారం, ఆగస్టు 31, 2014

తూనీగా తూనీగా...

ఒక టైమ్ లో తెలుగు సినీ ప్రేక్షకులను మధురమైన సంగీతంలో ఓలలాడించిన ఆర్పీపట్నాయక్ స్వరపరచిన ఒక చక్కని పాట ఇది. నాకు ఇష్టమైన ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మనసంతానువ్వే (2001)రచన : సిరివెన్నెలసంగీతం : ఆర్.పి.పట్నాయక్గానం : సంజీవని, ఉషతూనీగా తూనీగా  ఎందాకా పరిగెడతావే  రావే నా వంకాదూరంగా పోనీకా  ఉంటాగ నీ వెనకాలే  రానీ సాయంగా ఆ వంక ఈ వంక...

శనివారం, ఆగస్టు 30, 2014

నిదురించే తోటలోకి

నాకు రేడియో పరిచయం చేసిన అద్భుతమైన పాటలలో ఇదీ ఒకటి... పాట మొదలవగానే ఏ పని చేస్తున్నా కూడా ఎక్కడివక్కడ ఆపేసి మరీ వినేవాడ్ని. సుశీల గారు పాడిన ది బెస్ట్ సాంగ్స్ లో ఇదీ ఒకటనవచ్చునేమో. మహదేవన్ గారి సంగీతం శేషేంద్రశర్మ గారి సాహిత్యం సుశీలమ్మగారి గాత్రం కలిసిన ఈ పాట విన్నవెంటనే మనసులో చెరగని చోటు సంపాదించేసుకుంటుంది. మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ముత్యాల ముగ్గు (1975) సంగీతం...

శుక్రవారం, ఆగస్టు 29, 2014

ఎవరవయ్యా..ఎవరవయ్యా...

శ్రీ వినాయక విజయం సినిమాలో చిన్నారి వినాయకుణ్ణి ఉద్దేశించి పార్వతీ దేవి పాడే ఈ పాట నాకు చాలా ఇష్టం, దేవులపల్లి వారి రచన ఆకట్టుకుంటే సాలూరి వారి సంగీతం మార్ధవంగా సాగి మనసుకు హాయినిస్తుంది. వినాయక చవితి సంధర్బంగా మీరూ ఈ చక్కని పాట చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : శ్రీ వినాయక విజయం(1979) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం : దేవులపల్లి గానం : పి.సుశీల ఎవరవయ్యా.....

గురువారం, ఆగస్టు 28, 2014

వేటాడందే ఒళ్ళోకొచ్చి...

చేతిలో బంగారమంటి విద్య ఉండి కూడా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా బతికేస్తూ ఏ పని చేయకుండా జాతకాలనూ బల్లి శాస్త్రాలను నమ్ముకుని అదృష్టం కోసం ఎదురు చూసే మనిషి "లేడీస్ టైలర్" సినిమా కథానాయకుడు సుందరం. పల్లెల్లో ఆహ్లాదకరమైన ఉదయపు వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతూ ఆతని బద్దకం గురించి కూడా ప్రేక్షకులకు చక్కని అవగాహన వచ్చేలా టైటిల్స్ కి నేపధ్యంగా ఒక పాట పెడితే బాగుంటుందనుకున్నారు వంశీ. తన ఆలోచనలకు సిరివెన్నెల గారు చక్కని అక్షరరూపమిస్తే ఇళయరాజా గారు...

బుధవారం, ఆగస్టు 27, 2014

మనసు పలికే...

ఇళయరాజా, విశ్వనాథ్ గారి కలయిక గురించి చెప్పేదేముంది... నాకు నచ్చిన ఈ పాట మీరూ చూసి విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : స్వాతి ముత్యం (1986)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : సి.నారాయణ రెడ్డి గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకిమనసు పలికే... మనసు పలికేమౌనగీతం... మౌనగీతంమనసు పలికే మౌనగీతం నేడేమమతలొలికే... మమతలొలికేస్వాతిముత్యం... స్వాతిముత్యంమమతలొలికే స్వాతిముత్యం నీవేఅణువు అణువు ప్రణయమధువుతనువు...

మంగళవారం, ఆగస్టు 26, 2014

నీ నడకల స్టైలదిరే...

సౌతిండియన్ స్టైల్ ఐకాన్ గా అప్పటికే చాలా పాపులర్ అయిన రజనీకాంత్ పాపులారిటీని పదింతలు పెంచేసి తన ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన బిగ్గెస్ట్ మాస్ హిట్ "బాషా". తెలుగు తమిళ్ సినిమాలలో ఒక సరికొత్త ట్రెండ్ కు ఈ సినిమా నాంది పలికింది. అందులో పాటలూ, ప్రతి ఒక్క సీన్ తో సహా అన్నీ పాపులరే... సినిమా వచ్చి ఇరవై ఏళ్ళైనా ఇప్పటికీ మాణిక్యం, మాణిక్ భాషా ల రిఫరెన్స్ అపుడపుడు ఆటోవాలాల దగ్గర వినిపిస్తుంటుంది. ఈ సినిమా నెరేషన్ ని అనుకరిస్తూ తీసిన తీస్తున్న సినిమాలకైతే...

సోమవారం, ఆగస్టు 25, 2014

వాన మేఘం...

ఈ రోజు శ్రావణ మాసం చివరి రోజు... వాన పాటలకిక శలవు చెప్తూ చివరిగా "డాన్స్ మాస్టర్" సినిమాలోని "వాన మేఘం..." అనే పాటను గుర్తు చేసుకుందామా... ఈ పాట సూతింగ్ మ్యూజిక్ బోలెడంత ఆహ్లాదకరమైన అనుభూతిని మనసొంతం చేస్తే వేటూరి గారి సింపుల్ లిరిక్ అండ్ బాలచందర్ గారి చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : డాన్స్ మాస్టర్ (1986) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : చిత్ర వాన...

ఆదివారం, ఆగస్టు 24, 2014

తకిట తధిమి..

సాగర సంగమం సినిమాలోని ఈ పాటకి పరిచయ వాక్యాలు రాయడమంటే సూరీడిని దివిటీ తో చూపించడం లాంటిదే. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ గుర్తు చేసుకోండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.   చిత్రం : సాగరసంగమం (1983) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : ఎస్.పి.బాలు తకిట తధిమి తకిట తధిమి తందానా హృదయ లయల జతుల గతుల తిల్లానా ॥ తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన॥ శ్రుతిని లయని ఒకటి చేసి ॥ నరుడి...

శనివారం, ఆగస్టు 23, 2014

జల్లంత కవ్వింత కావాలిలే..

వర్షాన్ని మణిరత్నం గారు ఉపయోగించుకున్నంతగా మరెవ్వరూ ఉపయోగించుకోలేరేమో... హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ లో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి లోని ఈ పాటంటే నాకు చాలా ఇష్టం... ఇప్పటికీ వింటూంటే సినిమా విడుదలైన రోజులలో టీనేజ్ లో ఎంత పిచ్చిగా ఎంజాయ్ చేశామో గుర్తొస్తూ ఉంటాయ్. బహుశా ఈ పాటని ఇష్టపడని తెలుగు వాళ్ళుండరేమోలెండి.. మీరూ మరోసారి గుర్తుచేసుకుని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం...

శుక్రవారం, ఆగస్టు 22, 2014

సిరి కథ...

ఈరోజు శ్రావణ శుక్రవారం సంధర్బంగా "మహానగరంలో మాయగాడు" సినిమాలో లక్ష్మీ దేవి గురించిన ఈ సిరికథ గుర్తు చేసుకుందామా. భయమే మన శత్రువనీ... మిగిలిన సప్తలక్ష్ములను విధివశాత్తు కోల్పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యలక్ష్మిని మాత్రం పోగొట్టుకోకూడదని, ధైర్యం ఉంటే మిగిలిన సప్త లక్ష్ములూ తమంత తామే తిరిగి వస్తారని బోధించే ఈ కథ చాలా బాగుంటుంది. మీరూ చూసీ వినీ గుర్తుంచుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం...

గురువారం, ఆగస్టు 21, 2014

వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా..

శేఖర్ కమ్ముల చిత్రీకరించిన మరో అందమైన వానపాట ఇది. వేటూరి గారు పడవలు, బడి సెలవలు, పకోడీలు, ఇంద్రధనసులు వేటినీ వదలకుండా బాల్య జ్ఞాపకాలతో మొదటి చరణం అల్లేశారు. అలాగే రెండవచరణంలో వయసు రేపే తీయని వలపు గిలిగింతలను సున్నితంగా వర్ణించడం ఆ మహాకవికే చెల్లింది. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఆనంద్ (2004)సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్సాహిత్యం : వేటూరిగానం...

బుధవారం, ఆగస్టు 20, 2014

సందెపొద్దు మేఘం...

నాయకుడు సినిమాలోని ఒక చక్కని వానపాట ఈరోజు మీకోసం... మణిరత్నం కమల్ ల ఈ సినిమా నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ లో ఒకటి. ఈ పాట చిత్రీకరణ బస్తీవాళ్ళ ఆటపాటలు నాకు చాలా ఇష్టం. మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం: నాయకుడు (1987)సంగీతం: ఇళయరాజా సాహిత్యం : రాజశ్రీగానం: బాలు, సుశీల సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ...చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...హోయ్ పలికెను రాగం సరికొత్త...

మంగళవారం, ఆగస్టు 19, 2014

ఒకే కావ్యం...

వర్ణ సినిమాలోని నాకు నచ్చిన ఒక మంచి పాట ఇది... చిత్రీకరణ కూడా బాగుంటుంది.. వేరే ప్రపంచం అంటూ చిత్రీకరించిన సీన్స్ కొన్ని అందంగా ఉంటాయి... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : వర్ణ (2013) సంగీతం : హారీస్ జయరాజ్ రచన : చంద్రబోస్ గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒకే కావ్యం ఒకే శిల్పం ఒకే చిత్రం అదే ప్రణయం మన తనువు మారును తరము మారును స్వరము మార్చదు ప్రేమా ప్రేమా మరణం.. ప్రేమా మరణం రెండూ ఒకటే...

సోమవారం, ఆగస్టు 18, 2014

తాళాలతో వాన...

ఈ రోజు పాట "తెనాలి" సినిమా కోసం ఎ.ఆర్. రెహ్మాన్ స్వర సారధ్యంలో వేటూరి గారి రచన. పూర్తి హాస్య రస ప్రధానమైన ఈ సినిమా మూడ్ కు తగినట్లుగానే పాట చిత్రీకరణ కూడా హాస్యంగా ఉంటుంది. నాకు ఇష్టమైన ఈ పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : తెనాలి (2000) సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం : వేటూరి గానం : బాలు, శైలజ, సలోని, పార్థసారధి, శరణ్య తాళాలతో వాన తైతక్కలాడిందా డివ్విట్టమంటూ...

ఆదివారం, ఆగస్టు 17, 2014

విన్నావ యశోదమ్మ...

జన్మాష్టమి సందర్బంగా మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు... ఈరోజు బోలెడన్ని పిండివంటలు చేసేసి సాయంత్రం చిన్నికృష్ణుడి పాదాలు వేసి మరీ ఆ కన్నయ్యని ఆహ్వానించేస్తారు కదా గృహిణులంతా. ఈ సంధర్బంగా ఆ వెన్నదొంగ అల్లరిని తెలిపే ఈ చక్కని నృత్యరూపకాన్ని తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మాయాబజార్ (1957)  సంగీతం : ఘంటసాలసాహిత్యం : పింగళి నాగేంద్ర రావుగానం : పి.లీల, సుశీల, స్వర్ణలత(సీనియర్)  గోపికలు...

శనివారం, ఆగస్టు 16, 2014

టిప్పులు టప్పులు...

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమా లోని ఒక అందమైన వాన పాట ఇది నాకు చాలా ఇష్టం. రాథాకృష్ణన్ తన శైలికి భిన్నంగా కాస్త వేగంగా ఉన్న ట్యూన్ ఇచ్చినా దానికి వేటూరి గారు రాసిన సాహిత్యం చాలా చక్కగా ఉంటుంది. గోదారి మీద లాంచీల్లో వర్షంలో చిత్రీకరించిన తీరు కూడా నాకు చాలా ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : గోదావరి (2006) సంగీతం : కె.యమ్.రాథాకృష్ణన్ సాహిత్యం :  వేటూరి గానం :...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.