
బాలసుబ్రహ్మణ్యం గారు మొదటిసారి సంగీత దర్శకత్వం వహించిన "కన్యకుమారి" చిత్రంలోని ఒక చక్కని మెలోడి ఈ రోజు మీకోసం. ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్ లో దాసరి గారు మాట్లాడుతూ... వేటూరి గారు ఎంతో అభిమానించి రాసుకున్న ఈ సాహిత్యాన్ని ఒక దర్శకుడు తిరస్కరించారని బాధపడుతుంటే తాను ఈ సినిమాలో సంధర్బానుసారంగా ఉపయోగించుకున్నాను అని చెప్పారు. ఈ పాట వీడియో దొరకలేదు ఆడియో ఈ కింది ఎంబెడెడ్ విడ్జెట్ లో వినవచ్చు.. అది లోడ్ అవకపోతే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు....