శుక్రవారం, జూన్ 06, 2014

చలిగాలి చలిగాలి...

రన్ సినిమా కోసం విద్యాసాగర్ స్వరపరచిన ఈ పాట చక్కని ట్యూన్ తో ఆకట్టుకుంటుంది లిరిక్స్ లోని భావం బాగుంటుంది. యూట్యూబ్ యాక్సెస్ లేనివాళ్ళు ఆడియో ఇక్కడ వినవచ్చు.



చిత్రం : రన్ (2003)
సంగీతం : విద్యాసాగర్
రచన : ఎ.ఎం.రత్నం, శివ గణేష్
గానం : బలరామ్ , సాధనా సర్గం

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

మనముండే చోటు ఏకాంత ద్వీపం 
ఎవ్వరికి అనుమతి లేదంటా
ఓ.. దారితప్పి ఎవరో వస్తే రావొచ్చు 
చిరునామా ఇంటికి వలదంట
నే వెతికే సొగసరివి నే మెచ్చే గడుసరివి
ఊపిరిలో ఊపిరివి నాలోన ఆవిరివి
ఎన్ని సిరులైనా వదిలేస్తా నిను మాత్రం బంధించేస్తా
ఏమో నా హృదయం పొంగింది 

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

హొ.. నిదురేమో నీది కలలన్నీ నావి 
నిద్దురను కలచి వెయ్యొద్దు
పదమేమో నీది పాదాలు నావి 
పయనాన్ని ఆపి వెయ్యొద్దు
నీ పేరే నా మదిలో వేదంలా వల్లిస్తా
నువు నడిచే దారంట మేఘాలే పరిచేస్తా
ఇద్దరము కలిసిపోదాం లోకంలో నిలిచి ఉందాం
కలలన్ని నిజమే చేసేద్దాం

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా


2 comments:

యెన్ని వేల సార్లు వర్ణించినా, ప్రపంచమున్నంత వరకూ ప్రేమ వన్నె తరిగిపోదేమో అనిపిస్తుంటుందండీ..

కరెక్ట్ గా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail