గురువారం, జూన్ 26, 2014

తీయ తీయని కలలను...

బోంబే జయశ్రీ గారు పాడిన మరో మంచి పాట ఇది, చాలా బాగుంటుంది. ఇలాంటి చక్కని సంగీతాన్ని కంపోజ్ చేయగలిగిన ఆర్పీ పట్నాయక్ తన ట్యూన్స్ ఒకేలా కాకుండా జాగ్రత్తపడుతూ వైవిధ్యమైన సంగీతాన్నిచ్చి మ్యూజిక్ కెరీర్ పై మరికొంత శ్రద్దపెట్టి ఉంటే మరిన్ని మంచి పాటలు అందించగలిగి ఉండేవాడేమో. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : శ్రీరామ్ (2002)
సంగీతం : ఆర్పీ పట్నాయక్ 
సాహిత్యం : ఆర్పీ పట్నాయక్, కులశేఖర్ 
గానం : బోంబే జయశ్రీ

తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో
నేనెవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలొ

తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో

తందారె నరె నరె నరె నరె నారే...తందారె నరె నరె నారే
తందారె నరె నరె నరె నరె నారే...తందారె నరె నరె నారే

చల చల్లని మంచుకు అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో
నును వెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో
వచ్చీ రానీ కన్నీరుకే తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటొ

తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో

మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో
కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్లలో

తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
 

4 comments:

"వచ్చీ రానీ కన్నీరుకే తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటొ"

Lovely !!!

$

తన పాటల్లో యెన్న్నో అందమయిన అనుభూతులని పొదిగిన కులశేఖర్, జీవితమనే ఆటలో అన్ని అనుభూతులూ, అనుభవాలూ ఎరైజ్ అయి మిగిలిపోవడం నిజంగా భాధాకరం..

నిజమే శాంతి గారు.. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని బహుశా అందుకే అన్నారేమో..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail