గురువారం, జూన్ 12, 2014

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...

జి.ఆనంద్ గారి పాటలు ఈ బ్లాగ్ లో ఇదివరకు కూడా చూశారు. తన గొంతులోని ప్రత్యేకత కొన్ని పాటలకు ఒక వైవిధ్యమైన ఫీల్ ను ఆపాదిస్తుంది. అలాంటి ఒక మధురగీతం బంగారుకానుక సినిమాలోని ఈ పాట, సత్యం గారు కట్టిన బాణీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ విని ఆస్వాదించండి. యూట్యూబ్ పని చేయని వారు ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : బంగారు కానుక (1982)
సంగీతం : సత్యం
సాహిత్యం : సాహితి
గానం : జి. ఆనంద్, సుశీల

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం..
ఆ రాముడు నా వరుడిగా చేరగా..
ప్రేమ బృందావనం ...

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం..
ఆ సీతే నా వధువుగా చేరగా
ప్రేమ బృందావనం....

పెళ్ళికే పాల మబ్బు పందిరే వేసెనయ్యా..
పచ్చనీ తీగలన్ని తోరణం చేసెనయ్యా ...
తారలే తలంబ్రాలై కురిసేనయ్యా ...
నా...కన్నులా...
కళ్యాణజ్యోతుల కాంతులు మెరిసే ...

ప్రేమ బ్రందావనం పలికెలే స్వాగతం...

గాలికే నీ అందం కవితలే నేర్పెనమ్మా...
వీణకే నీ గానం స్వరములే తెలెపెనమ్మా..
చందమామ నీ ముందూ ఎందుకే బొమ్మా....
ఆ...అమ్మమ్మా.... 
అపురూప సుందర అప్సర నీవు...

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...

పాలలో తేనెవలే మనసులే కలిసెనయ్యా...
కలిపిన కొంగులు రెండూ విడిపోవమ్మా...
మా.. జంటనే ...
దీవించగా.. గుడి గంటలు మ్రోగే..

ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం...
ఆ రాముడు నా వరుడిగా చేరగా..
ప్రేమ బృందావనం...

7 comments:

థాంక్స్ శ్రీకాంత్ గారు.

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు శ్రీ జి.ఆనంద్ ఫాన్స్, ఈ పాట ఇంత అద్భుతం గా వుండటానికి కారణం కేవలం మెలొడీ కింగ్ సత్యం గారని నా నమ్మకం..

థాంక్స్ శాంతి గారు :-)

This is inspired by Ilayaraaja's song "vaan meghangale"

థాంక్స్ అజ్ఞాత గారు... ఆ పాట ఇపుడే విన్నాను.. తమిళ్ ట్యూన్ నే రీ యూజ్ చేసినట్లున్నారండీ.. అప్పట్లో మరి వారి ఒప్పందం ఏమిటో.. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.

ఈ పాటకు సంబంధించిన మరికొంత సమాచారం సాహితి గారి ఇంటర్వూలో చూశాను అది క్రింద ఇస్తున్నాను ...
http://www.gotelugu.com/issue5/119/telugu-cinema/saahithi-interview/

(భారతీ రాజా తీసిన 'పుదియ వార్పుగళ్' అనే తమిళ సినిమా ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్టు. అందులో ఇళయరాజా చేసిన పాటలు ఇప్పటికీ హిట్టు. వాటిలో మలేషియా వాసుదేవన్, ఎస్.జానకి పాడిన 'వాన్ మేఘంగళే' మరీ మరీ హిట్టు. 'బంగారు కానుక' సినిమాకి ఇళయరాజా చేత మ్యూజిక్ చేయించుకుందామని ఈ పాట ట్రాక్ కొనుక్కున్నారు కూడా. ఆ ట్యూన్ కే సాహితి రాసిన 'ప్రేమ బృందావనం' పాటని సుశీల, జి.ఆనంద్ పాడేరు. ట్రాక్ మిక్సింగే కనుక ఇళయరాజా రాలేదు. ఆయన అసిస్టెంట్లు వచ్చి చేశారు.

'బంగారు కానుక' సినిమాగా కార్యరూపం దాల్చే సరికి ఈక్వేషన్లు మారిపోయాయి. సత్యం సంగీత దర్శకుడు గా ఫిక్స్ అయ్యారు. ఆయన ఈ సినిమాకి సెపరేట్ గా ట్యూన్లు చేసుకున్నారు. ఈ 'ప్రేమ బృందావనం' పాటని పక్కన పడేశారు. గానీ అప్పటికే ఈ పాట పాప్యులర్ అయిపోయింది. ఎలాగూ 'బంగారు కానుక' సినిమాకి సత్యం పేరు మ్యూజిక్ డైరెక్టర్ గా బైటికొచ్చేసింది కనుక ఈ పాట కూడా సత్యం పేరు మీదే చలామణి అయిపోయింది. నిజానికి ఈ పాటకీ సత్యానికి ఏ సంబంధమూ లేదు.

ఇప్పటికీ నెట్ లలో ఆడియో రూపం లో ఈ పాట దొరుకుతుంది - సంగీత దర్శకుడిగా సత్యం పేరుతో. తర్వాత కొన్నాళ్ళకి 'పుదియ వార్పుగళ్' సినిమాని భారతీ రాజా 'కొత్త జీవితాలు' సినిమాగా రీమేక్ చేసినప్పుడు 'వాన్ మేఘంగళే' పాట ప్లేస్ లో వున్న 'పొంగి పొరలే' పాటకి మరో కొత్త ట్యూన్ చేసుకున్నారు ఇళయరాజా. 'వాన్ మేఘంగళే' , 'పొంగి పొరలే ' పాటలు యూ ట్యూబ్ లో దొరుకుతాయి చూడొచ్చు. 'ప్రేమ బృందావనం' పాట నెట్ లో దొరుకుతుంది. వినొచ్చు.)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.