బుధవారం, జూన్ 11, 2014

నీలి మేఘమా జాలి చూపుమా...

నా చిన్నతనంలో నాకు రేడియో పరిచయం చేసిన పాటలలో ఇదీ ఒకటి, వింటున్నపుడు ఆనాటి రోజుల్లోకి వెళ్ళిపోతాను. ఎల్పీ రికార్డ్ లో వచ్చే చిర్పింగ్ సౌండ్, బ్యాటరీ రేడియోలో మధ్య మధ్య వచ్చే డిస్ట్రబెన్స్ తో సహా మదిలో అలా ముద్రించుకు పోయిన పాటలివి. వాణీజయరాం గారి స్వరం ప్రత్యేకంగా గుర్తుండి పోతుంది. ఈ పాట వీడియో దొరకలేదు కింది ఎంబెడ్ ఫైల్ కనిపించని వాళ్ళు ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమ్మాయిల శపథం (1975)
సంగీతం : విజయ్ భాస్కర్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, వాణీ జయరాం

నీలి మేఘమా జాలి చూపుమా
ఒక నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి 
నన్ను కలిపి వెళ్ళుమా

కన్నె అందమా కలత మానుమా
ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము 
ఎదుట నిలిచె చూడుమా

ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
కలలు పండి నిజముగా 
కనుల యెదుట నిలిచెగా
రా.. జాబిల్లీ నా నెచ్చెలీ.. 
జాగేల.. ఈవేళ.. నను చేరగా

నీలి మేఘమా జాలి చూపుమా..
ఒక నిముషమాగుమా
నా రాజుతో ఈ రాతిరి 
నన్ను కలిపి వెళ్ళుమా..ఆ..ఆ 

కళ్యాణ మేళాలు మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా
కళ్యాణ మేళాలు మ్రోగించనా..
కంఠాన సూత్రాన్ని ముడివేయనా..
గుండె గుడిగా చేయనా.. 
నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై... సావాసినై... 
నా ప్రేమ పుష్పాల పూజించనా... 
 
కన్నె అందమా కలత మానుమా..
ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము 

ఎదుట నిలిచె చూడుమా


2 comments:

నలదమయంతుల హంస రాయబారమల్లే, మహా కవి కళిదాసు రచించిన మేఘసందేశం కూడా యెందరో కవులను ఇన్స్పైర్ చేసిందనిపిస్తుందండీ..అందుకే తరాలు మారినా మేఘమాల ప్రేమికుల మధ్య చెదిరి పోని వారధయ్యింది..

బాగా చెప్పారు శాంతి గారు.. థాంక్స్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.