శుక్రవారం, మే 16, 2014

చిరుగాలి వీచెనే...

ఇళయరాజా గారి సంగీతంలోని మాజిక్ ని మరోసారి రుచి చూపించిన పాట ఇది. ఈ పాట పాడే ఆవకాశం రావడం ఆర్పీ.పట్నాయక్ చేసుకున్న అదృష్టం అని చెప్పచ్చేమో. అలాగే ఈ పాటే వనమాలికి మంచి రచయితగా గుర్తింపు తీసుకువచ్చిన పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఆర్పీ వర్షన్ ఇక్కడ సునీత,ఆర్పీ కలిసి పాడిన వర్షన్ ఇక్కడ వినవచ్చు (లిరిక్స్ రెండిటికీ ఒకటే) లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : శివపుత్రుడు (2004)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వనమాలి
గానం : ఆర్పీ.పట్నాయక్

చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో.... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే..


కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసెనే..
తనవారి పిలుపుతో.. ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే 


చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో.... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే..

తుళ్ళుతున్న చిన్న సెలయేరు గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ.. బంధమంతా వెల్లువైనదీ.. లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది
నీకు తోడు ఎవరంటూ లేరు గతములో
నేడు చెలిమిచెయ్ చాపే వారే బ్రతుకులో
కలిసిన బంధం. కరిగిపోదులే.
మురళి మోవి విరిని తావి కలిసిన వేళా... 


చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో.... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే.. 

ఓ... మనసున వింత ఆకాశం మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకుబెళుకా ప్రతి మలుపు ఎవరికెరుక
విరిసిన ప్రతి పూదోట కోవెల వడి చేరేనా
రుణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది
రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో
ఏవో పదములే పాడే మోహం గుండెలో
ఏనాడూ. తోడు లేకనే .
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే...

కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసినే..
తనవారి పిలుపుతో.. ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే...


2 comments:

ఆర్ పి లైఫ్ లో మైల్ స్టోన్ ఈ పాట..

అవునండీ తనకి కూడా మర్చిపోలేని పాట అయి ఉంటుంది ఇది. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.