ఆదివారం, మే 04, 2014

నీలి మేఘమా అంత వేగమా...

విలేజ్ లో వినాయకుడు సినిమా కోసం కార్తీక్ పాడిన ఒక చక్కని పాట మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : విలేజ్ లో వినాయకుడు (2009)
సంగీతం : మణికాంత్ కద్రి
సాహిత్యం : వనమాలి
గానం : కార్తీక్

నీలి మేఘమా.. అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకీ రంగులు నీ వరమా
తూనీగా రెక్కలే పల్లకీగా.. 
ఊరేగే ఊహలే ఆపడం నా తరమా

నీలి మేఘమా.. అంత వేగమా
ఓ నిముషం ఆగుమా.. 
నేలకీ రంగులు నీ వరమా 

ప్రతీ మలుపులోనూ తనే కొలువయిందీ
ఒకో జ్ఞాపకన్నీ నాకే పంచుతోందీ
ఆ ఏటి గట్టూ అల పాదాలతోటీ .. 
ఈ గుండె గదిని తడి గురుతు చూపుతుందీ
ఆ నదులూ .. విరిసే పొదలూ .. 
నా ఎదకూ ఆమెనే చూపినవి

నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా.. 
నేలకీ రంగులు నీ వరమా

మదే కనని పాశం ఇలా ఎదురయిందా
తనే లోకమన్నా ప్రేమే నవ్వుకుందా
ఈ ఇంటిలోని అనుబంధాలు చూసీ.. 
నా కంటిపాపే కరిగింది ముచ్చటేసి 
ఈ జతలో.. ఒకడై ఒదిగే.. 
ఓ వరమే చాలదా ఎన్నటికీ

నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా.. 
నేలకీ రంగులు నీ వరమా 
 

4 comments:

Very beautiful song. Thanks for the post.

$

థాంక్స్ సిద్ గారు..

ఈ సాంగ్ మొదటి లైన్ చూస్తూనే.."నీలి మేఘమా-జాలి చూపుమా " అన్న అమ్మాయిల శపధం లో పాట ఫ్లాష్ లా గుర్తొచ్చేసింది వేణూజీ..వీలైతే ఆ పాట పోస్ట్ చేయగలరా..

మంచి పాట గుర్తు చేశారండీ, అలాగే తప్పకుండా పోస్ట్ చేస్తాను. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail