బుధవారం, మే 14, 2014

నవమి నాటి వెన్నెల నేను...

రమేష్ నాయుడు గారి మరో ఆణిముత్యం ఈ పాట, నాకు చాలా ఇష్టమైనది, ముఖ్యంగా మధురమైన ఆ బాణి వింటూంటే ఎంత హాయిగా ఉంటుందో మాటలలో చెప్పడం కష్టం. ఇక వేటూరి గారి నవమి దశమి పద ప్రయోగం గురించి కూడా చాలా చర్చలు జరిగాయి ఆన్ లైన్ ఫోరమ్స్ లో. కొందరు "ఇద్దరూ గొప్పే... కానీ అసంపూర్ణం.. ఆఇద్దరూ కలిస్తేనే పున్నమి..." అనే స్ట్రెయిట్ అర్ధమే ఉంది అంటే, ఇంకొందరు "జయసుధ హీరో కన్నా వయసులో పెద్ద కనుక, ఆమెను ముందు పుట్టిన నవమి నాటి వెన్నెలతో పోల్చి వేటూరి వారు చమత్కరించారు" అని అన్నారు. వాస్తవమేమిటో వేటూరి వారికే తెలియాలి, మనం మాత్రం మరోసారి ఈ పాటను గుర్తుచేసుకుని చూసీ వినీ ఎంజాయ్ చేద్దాం.

ఇక్కడ ఎంబెడ్ చేసినది ఫోటోలతో చేసిన ప్రజంటేషన్.. ఈ పాట వీడియో చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : శివరంజని (1978) 
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : వేటూరి 
గానం : బాలు, సుశీల  
 
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి 


నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి  

 
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు  

 
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవి గా
నీ నగవే సిగ మల్లిక గా
చెరిసగమై యే సగమేదో
మరచిన మన తొలి కలయికలో 

 
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
 
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి 


నవమి నాటి వెన్నెల నేను 
దశమి నాటి జాబిలి నీవు
 
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతి గా
అందించే నా పార్వతి గా
మనమొకటై రసజగమేలే
సరస మధుర సంగమ గీతికలో

నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
 
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి 


నవమి నాటి వెన్నెల నేను 
దశమి నాటి జాబిలి నీవు 

3 comments:

ఈ మూవీ లో మోహన్ బాబు డైలాగ్స్ ఎక్సెలెంట్ గా వుంటాయి..జయసుధ బావున్నా హీరొ సో,సో...సో కన్నులు మూసుకుని వింటే నిజంగా కార్తీక పున్నమి రేయి కనిపిస్తుంది.

ముఖ్యంగా మీరు వేసిన ఈ పిక్ చాలా, చాలా బావుంది సుమండీ..

హహహ అయితే హీరోమూలంగా ఈపాట కనులు మూసుకుని వినాలంటారనమాట :-)) థాంక్స్ ఫర్ ద కామెంట్. ఫోటో నచ్చినందుకు సంతోషం.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail