సోమవారం, మార్చి 31, 2014

కొమ్మలో ఒక కోయిల కూసిందీ..

అచ్చంగా జీవితం మనకి చూపించే రకరకాల రుచులకు మల్లే తీపి, కారం, చేదు, ఉప్పు, పులుపు, వగరు ఇత్యాది రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చళ్ళు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే నేటి రోజున నా బ్లాగ్ మిత్రులందరికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా కోటి గారి స్వర సారధ్యంలో వనమాలి గారి రచన "కొమ్మలో ఒక కోయిల కూసిందీ" పాట చూసి విని ఆనందిద్దామా. ఆడియో మాత్రమే వినాలనుకున్న వారు ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు....

ఆదివారం, మార్చి 30, 2014

దీవాలీ దీపాన్ని..

మడిసన్నాక కూసింత కలాపోషణ ఉండాలన్నారుకదా అని ఎప్పుడూ కళాపోషణే చేస్తే బోరుకొట్టదూ... అందుకే ఈ బ్లాగులో తరచూ కనిపించే మెలొడీల మధ్యలో అపుడపుడూ ఇలాంటి కాస్త హుషారున్న పాటలు కూడా అనమాట :-) దేవీశ్రీ సంగీతానికి రామజోగయ్య శాస్త్రి గారు రాసిన ఈ పాట నాకు పెప్పీ మూడ్ లో ఉన్నపుడు వినడం ఇష్టం మీరూ ఆస్వాదించండి.ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు ఆడియో ఇక్కడ వినవచ్చు. చిత్రం : దడ (2011) రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : ఆండ్రియా, కళ్యాణ్ చక్కెర...

శనివారం, మార్చి 29, 2014

నీవే అమర స్వరమే...

ఇళయరాజా గారి మరో ఆణిముత్యం, ఒకప్పుడు డబ్బింగ్ పాటలకు సైతం రాజశ్రీ గారు ఎంత చక్కని లిరిక్స్ రాసేవారో తెలియాలంటే ఈ పాట ఒక మంచి ఉదాహరణ. అప్పట్లో ఈ పాట చిత్రీకరణ మణిరత్నం చేసిన మరో సాహసం అని చెప్పచ్చేమో. నాకు చాలా ఇష్టమైన పాట తరచుగా వినేపాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : ఘర్షణ(1988) సంగీతం : ఇళయరాజా  సాహిత్యం : రాజశ్రీ గానం : బాలు, చిత్ర  నీవే అమరస్వరమే.. ...

శుక్రవారం, మార్చి 28, 2014

ఒంపుల వైఖరీ...

ఒక హాస్య ప్రధానమైన సినిమాకి రాసే అల్లరి పాటకి ఇంత చక్కని సొగసైన సాహిత్యం ఒక్క సిరివెన్నెల గారు మాత్రమే రాయగలరేమో... వంశీ, ఇళయరాజా, సిరివెన్నెల ల కలయికలో జనించిన ఒక మేలి ముత్యమిది, నాకు ఎంతో ఇష్టమైన పాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)  సంగీతం : ఇళయరాజా  సాహిత్యం : సిరివెన్నెల  గానం : బాలు, చిత్ర   ఒంపుల వైఖరి సొంపుల వాకిలి...

గురువారం, మార్చి 27, 2014

నీ జతే నేననీ నా జతే నీవనీ..

దేవా సంగీత సారధ్యంలో వెన్నెలకంటి గారి ఈ పాట వినడానికి బాగుంటుంది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : భామనే సత్యభామనే (1996)  సంగీతం : దేవ సాహిత్యం : వెన్నెలకంటి  గానం : బాలు, చిత్ర  నీజతే నేననీ.. నాజతే నీవనీ..  తీయనీ ప్రేమే తలుపే తీయనీ..  నీజతే నేననీ.. నాజతే నీవనీ..  తీయనీ ప్రేమే తలుపే తీయనీ..  నాలోని తాళం పాడింది నీకై ఆవేదనా స్వరం.. ఆలాపనాయే నాలోని...

బుధవారం, మార్చి 26, 2014

జాబిల్లి కోసం ఆకాశమల్లే...

తెలుగు శ్రోతలకు పరిచయం చేయాల్సిన అవసరంలేని అద్భుతమైన పాట, ఇళయరాజా, బాలు, ఆత్రేయల అపురూప సృష్టి, నాకు చాలా చాలా ఇష్టమైన పాట.. మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.  చిత్రం : మంచిమనసులు (1986)  సంగీతం : ఇళయరాజాసాహిత్యం : ఆత్రేయ గానం : యస్.పి.బాలు   జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకైజాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై  నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనైజాబిల్లి కోసం ఆకాశమల్లే...

మంగళవారం, మార్చి 25, 2014

నాదం నీ దీవనే...

ఇళయరాజా గారి మరో మధురమైన కంపొజిషన్... జానకమ్మగారి స్వరంలో వేటూరి గారి అక్షరాలు ఆ అమ్మాయి ప్రేమని ఆరాధనని మన కనుల ముందు సాక్షాత్కరింపజేస్తాయి. తెలుగు వీడియో దొరకలేదు తమిళ్ వీడియో ఎంబెడ్ చేశాను. భారతీరాజ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. రాధ చాలా చక్కగా ఉంటుంది ఇందులో. ఈ పాట తెలుగు ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రాగమాలిక (1982) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : జానకి నాదం నీ దీవనే నీ రాగాలాపనే నీ...

సోమవారం, మార్చి 24, 2014

వీణ వేణువైన సరిగమ

రాజన్-నాగేంద్ర గారి మరో అద్భుత సృష్టి... వేటురి గారు బాలు, జానకి గార్లతో కలిసి.. మీరూ ఆస్వాదించండి.. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఈ పాటగురించి బ్లాగ్ మిత్రులు బ్లాగాడిస్తా రవిగారి విశ్లేషణ వేటూరి సైట్ లో ఇక్కడ చదవచ్చు.  చిత్రం : ఇంటింటి రామాయణం (1979) సంగీతం : రాజన్-నాగేంద్ర సాహిత్యం : వేటూరి గానం: బాలు, జానకి వీణ వేణువైన సరిగమ విన్నావా ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా తనువు తహతహలాడాల చెలరేగాల చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో... వీణ...

ఆదివారం, మార్చి 23, 2014

ఊరుకో ఊరుకో బంగారుకొండా..

ఆత్మబంధం సినిమాలోనిదే మరో చక్కనిపాట. ఏడ్చే బుజ్జాయిని బుజ్జగించే పాట. చాలాబాగుంది మీరూ వినండి. ఈ పాటని ఈ క్రింది ఎంబెడ్ చేసిన యూట్యూబ్ ఫైల్ లో 8:45 వరకూ ఫార్వార్డ్ చేసికానీ లేదా ఇక్కడ క్లిక్ చేసి కానీ వినవచ్చు. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఆత్మబంధం (1991)సంగీతం : కీరవాణి  సాహిత్యం : సిరివెన్నెల     గానం : బాలు, చిత్రఊరుకో ఊరుకో బంగారు కొండానల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండాదాయి దాయి దాయి...

శనివారం, మార్చి 22, 2014

మనసా వాచా...

వేటూరి గారు, శేఖర్ కమ్ముల, రాధాకృష్ణ కలిస్తే సంగీతాభిమానులకు సంబరమే కదా.. నాకెంతో ఇష్టమైన పాట. మీరుకూడా తనివితీరా ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : గోదావరి (2006) సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్ సాహిత్యం : వేటూరి గానం : ఉన్నికృష్ణన్, చిత్ర మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆఆఆఆ... ఆ మాట దాచా కాలాలు వేచా  నడిచా నేనే నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే...

శుక్రవారం, మార్చి 21, 2014

పున్నమిలాగా వచ్చిపొమ్మని...

కె.వి.మహదేవన్ గారి అసిస్టెంట్ గా అందరికీ తెలిసిన పుహళేంది గారు స్వరపరచిన పాట ఇది. పాట చాలా సార్లే విన్నాను కానీ సంగీతం పుహళేంది గారని ఇప్పటివరకూ తెలియదు. మీరూ వినండి. ఈ పాట చిమటాలో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన యూట్యూబ్ లింక్ కూడా కేవలం ఆడియో మాత్రమే. చిత్రం : జడగంటలు (1984) సంగీతం : పుహళేంది సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీల ఆ..ఆ...ఆ... లలలలలలలల.. లాలాలా... లాలాలా... పున్నమిలాగా వచ్చిపొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే...

గురువారం, మార్చి 20, 2014

ఎడారిలో కోయిలా తెల్లారనీ

బాలుగారి కోసం ఈ పాట ఎన్నివందల సార్లు అయినా వినవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. చిత్రం : పంతులమ్మ (1977) సాహిత్యం : వేటూరి సంగీతం : రాజన్ - నాగేంద్ర గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆఆఆఅ...మ్..మ్... ఎడారిలో కోయిలా.. తెల్లారనీ రేయిలా... ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా పూదారులన్నీ గోదారి కాగా పూదారులన్నీ గోదారి కాగా పాడింది కన్నీటిపాట ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా పల్లవించు ప్రతిపాట బ్రతుకు వంటిదే రాగమొకటి లేక తెగిన...

బుధవారం, మార్చి 19, 2014

ఓహో లైలా ఓ చారుశీలా...

బాలు గారు ఒక మాంచి స్టైల్ తో పాడిన పాట ఈ పాట. సినిమాకూడా అప్పట్లో వైవిధ్యంగా కార్ రేసుల నేపధ్యంతో తీసిన సినిమా బాగుంటుంది కాకపోతే కాన్సెప్ట్ కి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయినట్లు లేరు బహుశా ఏదైనా ఇంగ్లీష్ సినిమా నుండి డైరెక్ట్ లిఫ్ట్ ఏమో కూడా తెలీదు. ఇళయరాజా గారు స్వరపరచిన ఈ సినిమాలో పాటలన్నీ కూడా బాగానే ఉంటాయి. మీరూ ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.  చిత్రం : చైతన్య (1991)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం...

మంగళవారం, మార్చి 18, 2014

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు...

సిరివెన్నెల గారి మరో అందమైన పాట ఓ అల్లరి అమ్మాయి గురించి... నాకు చాలా ఇష్టమైన పాట మీరూ ఆస్వాదించండి చిత్రీకరణ సైతం చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. చిత్రం : జోష్(2009) సంగీతం : సందీప్ చౌతాసాహిత్యం : సిరివెన్నెలగానం : కార్తీక్నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళుఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళునీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళుఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళునిన్నిప్పుడు చూస్తే చాలు  చిన్నప్పటి చిలిపి క్షణాలుగుండెల్లో గువ్వల గుంపై వాలునీతో అడుగేస్తే...

సోమవారం, మార్చి 17, 2014

హోలీ శుభాకాంక్షలు..

ఇళయరాజా గారి అద్భుతమైన మ్యూజికల్ హిట్ "అభినందన" సినిమాలోని ఈ కలర్ ఫుల్ పాట హోలీ సందర్బంగా మీకోసం. హోలీ అనగానే ఉన్న నాలుగైదు పండగకి సంబంధించిన పాటలనే రొటీన్ గా షేర్ చేసుకునే బదులు రంగులమయమైన ఈ పాట షేర్ చేద్దామనిపించింది చూసి ఆనందించండి. మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు..   సహజసిద్దమైన రంగులు వాడడానికి ప్రయత్నించండి.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు.  చిత్రం : అభినందన (1988)సంగీతం : ఇళయరాజాసాహిత్యం...

ఆదివారం, మార్చి 16, 2014

అందాలొలికే సుందరి...

ఈ సినిమా విడుదలైనపుడు ఈ పాటలు ఎంత ప్రాచుర్యాన్ని పొందాయో మాటలలో చెప్పడం కష్టమేనేమో... మొత్తం స్టేట్ అంతటినీ ఒక ఊపు ఊపేసిన పాటలు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించిన టి.రాజేందర్ ఒక ముఖ్యపాత్ర కూడా పోషించారు. ఎవరా రాజేందర్ అంటారా ధైర్యమున్నవాళ్ళు ఈ ఫైట్ సీన్ చూసి తెలుసుకోండి. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి ఈ పాటతో పాటు ఈ సినిమాలోని మరికొన్ని పాటలు కూడా బాగుంటాయి. రేపు హోలీ సెలెబ్రేషన్స్ మొదలెట్టే ముందు ఈ కలర్ ఫుల్ పాట చూసి విని ఆనందించండి....

శనివారం, మార్చి 15, 2014

శశివదనే శశివదనే...

కొన్ని పాటల గురించి ఎక్కువ మాట్లాడకూడదు జస్ట్ విని ఆస్వాదించాలంతే... ఇదీ అలాంటి పాటే మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఇద్దరు (1997) సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం : వేటూరి గానం : ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా అందెల వన్నెల వైఖరితో నీమది తెలుపగ రావా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా అచ్చొచ్చేటి...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.