ఆదివారం, జనవరి 19, 2014

ఇలాగే ఇలాగే సరాగమాడితే

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలన్నీ బాగానే ఉంటాయి కానీ ఈ పాట కొంచెం ఎక్కువ బాగుంటుంది. ఎందుకో ఈ పాట నాకు సంగీత సాహిత్యాలంటూ ఎక్కువగా డిసెక్ట్ చేయకుండా ప్రశాంతంగా అలా వింటూ ఉండిపోవడం చాలా ఇష్టం. ఈ చక్కని పాట మీకోసం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : వయసు పిలిచింది (1978)
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : బాలు, సుశీల 
 
ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం
ఊయలూగునే

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం
ఊయలూగునే


వయసులో వేడుంది
మనసులో మమతుంది
వయసులో వేడుంది
మనసులో మమతుంది
మమతలేమో సుధామయం
మాటలేమో మనోహరం

మదిలో మెదిలే మైకమేమో

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం
ఊయలూగునే


కంటిలో కదిలేవు జంటగా కలిశావు
కంటిలో కదిలేవు జంటగా కలిశావు

నీవు నేను సగం సగం
కలిసిపోతే సుఖం సుఖం
తనువు మనసు తనివి రేపునే

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం
ఊయలూగునే

భావమే నేనైతే పల్లవే నీవైతే
భావమే నేనైతే పల్లవే నీవైతే
ఎదలోనా ఒకే స్వరం
కలలేమో నిజం నిజం

పగలు రేయి ఏదో హాయి

ఇలాగే ఇలాగే సరాగమాడితే
వయ్యారం ఈ యవ్వనం
ఊయలూగునే
ఊయలూగునే
ఆహహాహహహ

2 comments:

కుర్చీ అంచున కూర్చుని సినిమా చూడాలంటే 40 సూమో బ్లాస్ట్లూ, అనెండింగ్ చేజ్ లూ అవసరం లేదని బాలచందర్ గారి మూవీస్, ఇలాంటి మూవీస్ చూసినప్పుడల్లా మన సో కాల్డ్ హిట్ ఫార్ములా దర్శకులకి చెప్పాలనిపిస్తుంటుంది..

బాగా చెప్పారు శాంతి గారు, థాంక్స్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail