శుక్రవారం, జనవరి 24, 2014

పల్లవించవా నా గొంతులో

బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన "కోకిలమ్మ" సినిమాలోని ఈ పాట బాలుగారి లలితమైన స్వరాన్ని పట్టి చూపించే పాట. బాలచందర్ గారి ఆస్థాన సంగీత దర్శకులు ఎమ్మెస్ విశ్వనాథన్ గారి మధురమైన బాణీ ఆత్రేయ గారి సాహిత్యం కలసి కథానాయకుడి ప్రేమని కనుల ముందుంచేస్తాయి. ఈ మధురగీతం మీకోసం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.



చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా.. నా బ్రతుకు నీది కాదా

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే.. నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని.. నేనీనాడు పలకాలి నీ గీతిని
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే.. నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని.. నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని

చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో

నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని

చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో..
ప్రణయ సుధా రాధా.. నా బ్రతుకు నీది కాదా...
పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో..

2 comments:

బాలూమహేంద్ర వసంత కోకిల ని చూసి కనులు చెమ్మగిల్లితే, బాలచందర్ గారి కోకిలమ్మ ని చూసి గుండె చెమ్మగిల్లుతుంది..చాలా అపురూపమైన పాటిది..

అవును శాంతి గారు నాకూ చాలా ఇష్టమైన పాట ఇది. థాంక్స్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail