సోమవారం, జనవరి 20, 2014

కళకే కళ ఈ అందమూ

ఈ పాట ప్రారంభంలో వచ్చే ఆలాపన చాలా బాగుంటుంది ఇళయరాజా బాణిలో స్మూత్ గా అలా సాగిపోయే ఈ పాట వినడం నాకు చాలా ఇష్టమైన ఒక మంచి అనుభూతి. ఎంబెడ్ చేసిన వీడియోలో ఆలాపన లేదు అది వినాలంటే ఇక్కడ వీడియో లింక్ లో కానీ లేదా ఆడియోలో ఇక్కడ కానీ వినగలరు.చిత్రం : అమావాస్య చంద్రుడు (1981)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : బాలు

మ్మ్..మ్..మ్..మ్.మ్..
హాఆఆహా దరరారరారర..
దరారరరారర...
కళకే కళ ఈ అందమూ
ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ
కళకే కళ ఈ అందమూ

నీలి కురులు పోటీ పడెను .. మేఘమాలతో
కోల కనులు పంతాలాడే .. గండుమీలతో
వదనమో జలజమో.. నుదురదీ ఫలకమో
చెలి కంఠం పలికే శ్రీ శంఖము !

కళకే కళ ఈ అందమూ

పగడములను ఓడించినవి .. చిగురు పెదవులు .. హా
వరుస తీరి మెరిసే పళ్ళు .. మల్లె తొడుగులూ
చూపులో తూపులో .. చెంపలో కెంపులో
ఒక అందం తెరలో దోబూచులు..

కళకే కళ ఈ అందమూ

తీగెలాగ ఊగే నడుమూ .. ఉండి లేనిదీ
దాని మీద పువ్వై పూచీ .. నాభి ఉన్నదీ
కరములో కొమ్మలో .. కాళ్ళవీ బోదెలో
ఈ రూపం ఇలలో అపురూపము !

కళకే కళ ఈ అందమూ

2 comments:

ప్రేమని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఓ బైబిల్ లా, ఖురాన్ లా, భగవద్గీత లా ఈ మూవీని ఇంట్లో వుంచుకోవలనిపిస్తుంది ..అంత పిచ్చి ఇష్టం ఈ సినిమా నాకు..థాంక్యూ సో మచ్ వేణూజీ ఫర్ ప్రెజెంటింగ్ సచ్ యే హ్హార్ట్ టచింగ్ సాంగ్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail