బుధవారం, జనవరి 22, 2014

చూపులు కలసిన శుభవేళ..

అక్కినేని నాగేశ్వరరావు గారికి అంజలి ఘటిస్తూ... తను లెక్కకు మిక్కిలిగా చేసిన ప్రేమ చిత్రాలలో ఒక ప్రేమ పాటను ఎన్నుకోవడమనే అతి కష్టమైన పనిని చేయలేక నాకు బాగా ఇష్టమైన ఈ పాటను మీకోసం అందిస్తున్నాను. చలాకీ చిలిపివయసులో ఏఎన్నార్ ఎంత అందంగా ఉంటాడో ఈ పాటలో. ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినండి. 



చిత్రం : మాయాబజార్ 
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : పింగళి 
గానం : ఘంటసాల, లీల 
 
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ కలవరము
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ కలవరము

ఉల్లాసముగా నేనూహించిన
అందమే నీలో చిందెనులే

చూపులు కలసిన శుభవేళ 
 
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ పరవశము
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ పరవశము
ఏకాంతములో ఆనందించిన
నా కలలే నిజమాయెనులే 
చూపులు కలసిన శుభవేళ 

ఆలాపనలు సల్లాపములు
కలకల కోకిల గీతములే...
 
ఆలాపనలు సల్లాపములు
కలకల కోకిల గీతములే...
 చెలువములన్నీ చిత్ర రచనలే...
చెలువములన్నీ చిత్ర రచనలే
చలనములోహో నాట్యములే

చూపులు కలసిన శుభవేళ 

శరముల వలెనె చతురోక్తులను
చురుకుగా విసిరే నిజములే...
 
శరముల వలెనె చతురోక్తులను
చురుకుగా విసిరే నిజములే...
ఉద్యానమున వీర విహారమే..
ఉద్యానమున వీర విహారమే
తెలిపెను ఒహో శౌర్యములే
చూపులు కలసిన శుభవేళ
ఎందుకు నీకీ పరవశము

ఎందుకు నీకీ కలవరము

2 comments:

శిల లాంటి తన జీవితాన్ని శిల్పం గా మలుచుకున్న అమరశిల్పి యె.యన్.ఆర్..ఆయన జీవితాన్ని తరిచి చూస్తే మరే వ్యక్తిత్వ వికాస పుస్తకం చదవనవసరం లేదు..నేల వీడిన ఆ నెలబాలునికి భాష్పాంజలి..థాంక్యూ ఫర్ ద నైస్ జెస్చర్ వేణూజీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail