శనివారం, జనవరి 04, 2014

ఆలోకయే శ్రీ బాలకృష్ణం..

విశ్వనాథ్ గారి సినిమాలలో సంగీతానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. శ్రుతిలయలు చిత్రంలోని ఈ పాట ప్రారంభంలోని వేణుగానమే మనలని నేరుగా బృందావనంలోకి తీసుకువెళ్తుంది ఇక ఆపై బాలకృష్ణుడు మన కళ్ళముందు కనిపించేస్తుంటాడు. షణ్ముఖశ్రీనివాస్ నాట్యంతో ఈ పాట చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ చక్కని పాట చూసి విని ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ లేదా చిమటాలో ఇక్కడా వినవచ్చు. ఈ పాటకు కొన్ని మంచి చిన్ని కన్నయ్య చిత్రాలతో యూ ట్యూబ్ లో ఒక వీడియో ప్రజంటేషన్ చేశారు అది ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : శ్రుతిలయలు 
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : నారాయణ తీర్థులు
గానం : వాణీజయరాం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం ...
ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం
సఖీ... ఆనంద సుందర తాండవ కృష్ణం
సఖీ... ఆనంద సుందర తాండవ కృష్ణం
ఆలోకయే శ్రీ బాలకృష్ణం


చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కరసంగత కనక కంకణ కృష్ణం
చరణ నిక్వణిత నూపుర కృష్ణం
కరసంగత కనక కంకణ కృష్ణం
కింకిణీ జాల ఘనఘణిత కృష్ణం
కింకిణీ జాల ఘనఘణిత కృష్ణం
లోకశంకిత తారావళి మౌక్తిక కృష్ణం
మౌక్తిక కృష్ణం...
 
ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం
సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
నందనందనం అఖండ విభూతి కృష్ణం
సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
నందనందనం అఖండ విభూతి కృష్ణం
కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
కలికల్మష తిమిర భాస్కర కృష్ణం
 
ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం
గోవత్సబృందా పాలక కృష్ణం
కృత గోపికాజాల ఖేలన కృష్ణం
గోవత్సబృందా పాలక కృష్ణం
కృత గోపికాజాల ఖేలన కృష్ణం

నందా సునందాదీ....ఆఆఆఆ.. ఆఆఆ
నందా సునందాది.. సునందాది..
నందా సునందాది.. సునందాది..
సునందాది.. సునందాది...

నందసునందాది వందిత కృష్ణం
శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం
శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ...
సఖీ ...ఆనంద సుందర తాండవ కృష్ణం
సఖీ ...ఆనంద సుందర తాండవ కృష్ణం
తాండవ కృష్ణం..తాండవ కృష్ణం..తాండవ కృష్ణం..

4 comments:

మౌక్తిక మొక్కటి మినహయిస్తే, అచ్చంగా నారాయణతీర్ధుల వారి అక్షర రూపమే మీరందించిన వెన్నెముద్ద కృష్ణుడు..వేణుజీ..రెండు కళ్ళు చాల లేదంటే నమ్మండి..నెమలికన్నుల మధ్య వెన్నారగిస్తున్న చిన్ని కిట్టయ్య చాలా అందంగా వున్నాడు..

కదండీ శాంతి గారు నాకు ఈ పాట గురించి ఫోటోలు వెతుకుతుంటే ఈ ఫోటో కనపడగానే ఇక మరో ఆలోచన లేకుండా పోస్ట్ చేశానండి. థాంక్యూ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.