ఆదివారం, జనవరి 05, 2014

అలిగిన వేళనే చూడాలీ..

కన్నయ్య పాటలు పాడే అదృష్టం సుశీలమ్మ గారికే ఎక్కువ దక్కిందనుకుంటాను ఆవిడ పాడినవే ఎక్కువ పాటలు కనిపిస్తున్నాయి. గుండమ్మకథ చిత్రంలోని ఈ పాట చిత్రీకరణ సైతం అద్భుతంగా ఉంటుంది, ఇందులో సావిత్రిగారు నాకు మరీ మరీ నచ్చేస్తారు ఇక రామారావు గారి అలక నటన చూసి తీరవలసిందే. పింగళి వారి సాహిత్యం ఘంటసాల గారి సంగీతం సుశీలమ్మ గాత్రం గురించి ఏమని చెప్పగలం. నాకు ఎంతో ఇష్టమైన ఈ అందమైన గీతాన్ని మీరూ చూసీ విని ఆస్వాదించండి. ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు. 



చిత్రం : గుండమ్మ కథ 
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : పింగళి నాగేంద్రరావు
గానం : పి.సుశీల

అలిగిన వేళనే చూడాలి 
గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనే చూడాలి

రుసరుసలాడే చూపులలోనే
రుసరుసలాడే చూపులలోనే
ముసి ముసి నవ్వుల చందాలు

అలిగిన వేళనే చూడాలి

అల్లన మెల్లన నల్ల పిల్లి వలె 
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
అల్లన మెల్లన నల్ల పిల్లి వలె 
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను చూసి...ఈఈఈ..
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తల్లి మేలుకొని దొంగను చూసి 
అల్లరిదేమని అడిగినందుకే

అలిగిన వేళనే చూడాలి 
గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనే చూడాలి


మోహన మురళి గానము వినగా 
తహతహలాడుచు తరుణులు రాగా
మోహన మురళి గానము వినగా 
తహతహలాడుచు తరుణులు రాగా
దృష్టి తగులునని జడిసి యశోదా
దృష్టి తగులునని జడిసి యశోదా 
తనను చాటుగా దాచినందుకే

అలిగిన వేళనే చూడాలి 
గోకుల కృష్ణుని అందాలు
అలిగిన వేళనే చూడాలి 

4 comments:

అంత అందంగా బ్రతిమలాడేవాళ్ళుంటే అలగడం ఎంత బావుంటుందో..

హహహ కరెక్ట్ గా చెప్పారు జ్యోతిర్మయి గారు :-) థాంక్స్.

హెలో..హెలో..హెలో..వేణూజీ..ఇన్నాళ్ళూ బోలెడంతమంది దేవుళ్ళని పలుకరించడం లో పడిపోయి ఇటు అడుగు వేయలేదండీ..యెంత బావున్నడండీ కలువ కన్నుల నిండా నీటి ముత్యాలతో బుజ్జి కృష్ణుదు..పాట లో యన్.టి.ఆర్, సావిత్రిగార్ల అద్భుతమైన అభినయ మొకయెత్తైతే మీరందించిన ఫొటో మరో యెత్తండీ..టూ గుడ్..

థాంక్స్ శాంతి గారు, అంత బిజీ అయినా కూడా ఖాళీ దొరికాక చాలా సిన్సియర్ గా బ్యాక్ లాగ్స్ అన్నీ కవర్ చేసి పాత పోస్టులలో కామెంట్స్ పెట్టినందుకు బోలెడు ధన్యవాదాలు :-) ఫోటోనాక్కూడా ఛాలా నచ్చిందండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.