శుక్రవారం, జనవరి 31, 2014

మబ్బులోన చందమామ...

ఇళయరాజా గారి స్వరకల్పనలో సాహసమే జీవితం సినిమాకోసం ఏసుదాస్ గారు పాడిన ఈ పాట చాలా చాలా బాగుంటుంది. వేటూరి గారి చక్కని సాహిత్యం ఏసుదాస్ గారి కమ్మనైన గళంలోనుండి అలవోకగా జాలువారుతుంటే మనసు హాయైన లోకాలలో తేలిపోతూ ఆ మబ్బుచాటు చందమామని దర్శించేస్తుంది. ఈ చక్కని పాట మీరూ ఆస్వాదించండి. ఈ ప్లగిన్ పని చేయకపోతే ఇక్కడ డౌన్లోడ్ ప్రయత్నించండి.      చిత్రం : సాహసమే జీవితం (1984)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం : ఏసుదాస్బాదలోంమే..చంద్రమా..దిల్...

గురువారం, జనవరి 30, 2014

మనసున ఉన్నదీ/ఎలా ఎలా ఎలాతెలుపను

హ్మ్.. గతమూడురోజులుగా విన్న పాటలు చూసి ప్రేమలేఖలూ ఎలా చెప్పాలో తెలీక కన్ఫూజ్ అవడాలు కేవలం మగవారికి మాత్రమే పరిమితం కాబోలు అనుకుంటున్నారా.. లేదండీ నిజానికి ప్రేమకి ఆడామగా తేడా లేదు ఒకసారి ఆ దోమ కుట్టిందంటే పడే పాట్లు అందరి విషయంలోనూ కామనే. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి తనమనసులో ఉన్న ప్రేమంతా ఆ అబ్బాయికి చెప్పాలని ఉందట కానీ అతడెదురుపడితే బిడియం అడ్డుపడుతుందట ఆ విషయం మనకి చెప్పీ చెప్పకనే తన ప్రేమావస్థనంతా ఎలా ఈ పాట రూపంలో స్పష్టంగా చెప్పేస్తుందో సిరివెన్నెల...

బుధవారం, జనవరి 29, 2014

హలో హల్లో ప్రేమలేఖా

ఒకప్పుడు సందేశాలు అందించేందుకు పావురాలను, ఆ తర్వాత గుర్రాలపై వెళ్ళి సందేశాలను అందించే వేగులను, ఆ తర్వాత ఉత్తరాలను చేర్చే పోస్టల్ వ్యవస్థను, అటుపై టెలిగ్రాములను వాటితర్వాత వచ్చిన టెలీఫోనులను, ఈ మెయిల్స్ నూ, ఇప్పటి సెల్ఫోన్సూ, వాట్సాప్ లాంటి మెసెంజెర్స్ ఎట్సెట్రాలనన్నిటినీ ప్రేమ సందేశాలను అందించడానికి వాడుకున్నారు ప్రేమికులు. ఫోన్లు బాగా పాపులర్ అయిన టైమ్ లో ఉన్న ఈ ప్రేమికుడిని చూడండి, ప్రేయసితో డైరెక్ట్ గా మాటాడే ఛాన్స్ కోసం ఏకంగా ఫోను చేసేసి...

మంగళవారం, జనవరి 28, 2014

ప్రేమ లేఖ రాశా నీకంది ఉంటది

సరే ఎలాగోలా ప్రేమ లేఖ రాసేశాము పంపేశాము కదా ఇకనేం హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటున్నారా అయితే ఈ ప్రేమికుడిని చూడండి. ప్రేమలేఖ రాసేసి ఊరికే కూర్చోకుండా దానివెంటనే తనుకూడా ప్రేయసి వద్దకి వెళ్ళి అందిందో లేదో అడుగుతూ ఎలా ఓ చక్కని డ్యూయెట్ వేసేసుకున్నాడో. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. వీడియో క్రింద పదిహేనునిముషాల వరకూ ఫర్వర్డ్ చేసి చూడవచ్చు.   చిత్రం : ముత్యమంత ముద్దు (1989)సంగీతం : హంసలేఖ  సాహిత్యం :  వేటూరి  గానం...

సోమవారం, జనవరి 27, 2014

కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది

హ్మ్.. ప్రేమ చూడడానికి సింపుల్ గా ఉన్నట్లు ఉంటుంది కానీ ప్రేమికులకి ఎన్ని కష్టాలండీ... పాపం ఈ ప్రేమికుడిని చూడండి మనసులో ఎన్ని మధురమైన భావాలున్నా వాటిని ప్రేమలేఖలో అక్షరబద్దం చేయడానికి చదువుకోలేదట అంతమాత్రానా మౌనంగా ఊరుకుంటే అతను ప్రేమికుడెలా అవుతాడు లెండి అందుకే ఏమాత్రం మొహమాట పడకుండా తన ప్రియురాలి సహాయాన్నే తీసుకుని ఆ భావాలని అక్షరాలలో పెట్టించేశాడు. ఆ కథేమిటో మీరూ వినండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : గుణ (1991) రచన...

ఆదివారం, జనవరి 26, 2014

అందమైన ప్రేమరాణి/ఓ చెలియా

రహమాన్ సంగీతంతో శంకర్ దర్శకత్వంలో ప్రేమికుడు సినిమాకోసం చేసిన "అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే" అనే ఈ ప్రేమపాటలో ప్రేయసి ఎంత అపురూపమో కుర్రకారుకి సులువుగా అర్ధమయేలా చాలా సాధారణమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారు రాజశ్రీ. బాలు ప్రభుదేవాల డాన్స్ బిట్స్ తో ఈ పాట చిత్రీకరణ కూడా సరదాగా ఉంటుంది. ఈ చక్కని పాట మీకోసం :-) ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. చిత్రం : ప్రేమికుడు (1994) సంగీతం : ఏ.ఆర్. రెహమాన్ సాహిత్యం : రాజశ్రీ గానం : ఉదిత్ నారాయణ్,...

శనివారం, జనవరి 25, 2014

ఆకాశం ఏనాటిదో...

ఇళయరాజా గారి మరో మాజిక్ ఈ ఆకాశం ఏనాటిదో పాట... ఆత్రేయ గారి సాహిత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో మాటలలో చెప్పలేం. అచ్చమైన ప్రేమ పాటంటే ఇదేనేమో అనిపిస్తుంది. ప్రేమ అనేది విధి వ్రాత అనీ ప్రీ డిఫైన్డ్ డెస్టినీ అని సాగే ఈ పాట సాహిత్యం నాకు చాలా ఇష్టం. ఈ చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినండి. చిత్రం : నిరీక్షణ (1981) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : జానకి లాలలా..లాలాలల..లాలలా..లాలాలల ఆకాశం...

శుక్రవారం, జనవరి 24, 2014

పల్లవించవా నా గొంతులో

బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన "కోకిలమ్మ" సినిమాలోని ఈ పాట బాలుగారి లలితమైన స్వరాన్ని పట్టి చూపించే పాట. బాలచందర్ గారి ఆస్థాన సంగీత దర్శకులు ఎమ్మెస్ విశ్వనాథన్ గారి మధురమైన బాణీ ఆత్రేయ గారి సాహిత్యం కలసి కథానాయకుడి ప్రేమని కనుల ముందుంచేస్తాయి. ఈ మధురగీతం మీకోసం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. చిత్రం : కోకిలమ్మ (1983) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : బాలు పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా...

గురువారం, జనవరి 23, 2014

మధువొలకబోసే..

రామకృష్ణ గారి గళంలో ఆకట్టుకునే గీతం కన్నవారికలలు లోనీ ఈ మధువొలకబోసే గీతం. టిపికల్ సెవెంటీస్ తరహా చిత్రీకరణ ఇపుడు చూస్తే కొంచెం నవ్వొస్తుంది కానీ అప్పట్లో శోభన్ బాబు గారు వాణీశ్రీ లమీద తీసిన చిత్రీకరణ బహుశా ఒక ఊపు ఊపి ఉండచ్చేమో :-) ఈపాట కూడా నాకు రేడియోలోనే పరిచయం తరచుగా వినేవాడ్ని. ఈ అందమైన పాట మీకోసం ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు.       చిత్రం : కన్నవారికలలు సాహిత్యం : రాజశ్రీ ? సినారె సంగీతం : వి.కుమార్ గానం...

బుధవారం, జనవరి 22, 2014

చూపులు కలసిన శుభవేళ..

అక్కినేని నాగేశ్వరరావు గారికి అంజలి ఘటిస్తూ... తను లెక్కకు మిక్కిలిగా చేసిన ప్రేమ చిత్రాలలో ఒక ప్రేమ పాటను ఎన్నుకోవడమనే అతి కష్టమైన పనిని చేయలేక నాకు బాగా ఇష్టమైన ఈ పాటను మీకోసం అందిస్తున్నాను. చలాకీ చిలిపివయసులో ఏఎన్నార్ ఎంత అందంగా ఉంటాడో ఈ పాటలో. ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినండి.  చిత్రం : మాయాబజార్  సంగీతం : ఘంటసాల  సాహిత్యం : పింగళి  గానం : ఘంటసాల, లీల    చూపులు కలసిన శుభవేళఎందుకు...

మంగళవారం, జనవరి 21, 2014

మాటే మంత్రమూ

ఈ పాట గురించి ఏం చెప్పగలం, ఇప్పటివరకూ ఈ పాట వినని తెలుగు వాళ్ళుంటారని నేను అనుకోను. ఈ కమ్మని ఇళయరాజా గీతాన్ని మీరూ మరోసారి ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : శీతాకోక చిలుక (1981) సంగీతం : ఇళయరాజా  సాహిత్యం : వేటూరి  గానం : బాలు, శైలజ ఓం శతమానం భవతి శతాయుః పురుష‌శతేంద్రియ ఆయుష్షేవేంద్రియే ప్రతి తిష్ఠతీ !మాటే మంత్రమూమనసే బంధమూఈ మమతే ఈ సమతే మంగళ వాద్యమూఇది కళ్యాణం కమనీయం జీవితంఓ ఓ మాటే మంత్రమూ.....

సోమవారం, జనవరి 20, 2014

కళకే కళ ఈ అందమూ

ఈ పాట ప్రారంభంలో వచ్చే ఆలాపన చాలా బాగుంటుంది ఇళయరాజా బాణిలో స్మూత్ గా అలా సాగిపోయే ఈ పాట వినడం నాకు చాలా ఇష్టమైన ఒక మంచి అనుభూతి. ఎంబెడ్ చేసిన వీడియోలో ఆలాపన లేదు అది వినాలంటే ఇక్కడ వీడియో లింక్ లో కానీ లేదా ఆడియోలో ఇక్కడ కానీ వినగలరు. చిత్రం : అమావాస్య చంద్రుడు (1981) సంగీతం : ఇళయరాజా రచన : వేటూరి గానం : బాలు మ్మ్..మ్..మ్..మ్.మ్.. హాఆఆహా దరరారరారర.. దరారరరారర... కళకే కళ ఈ అందమూ ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ కళకే కళ ఈ అందమూ నీలి...

ఆదివారం, జనవరి 19, 2014

ఇలాగే ఇలాగే సరాగమాడితే

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలన్నీ బాగానే ఉంటాయి కానీ ఈ పాట కొంచెం ఎక్కువ బాగుంటుంది. ఎందుకో ఈ పాట నాకు సంగీత సాహిత్యాలంటూ ఎక్కువగా డిసెక్ట్ చేయకుండా ప్రశాంతంగా అలా వింటూ ఉండిపోవడం చాలా ఇష్టం. ఈ చక్కని పాట మీకోసం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : వయసు పిలిచింది (1978) సంగీతం : ఇళయరాజా  సాహిత్యం : ఆరుద్ర  గానం : బాలు, సుశీల    ఇలాగే ఇలాగే సరాగమాడితేవయ్యారం ఈ యవ్వనంఊయలూగునేఇలాగే...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.