మంగళవారం, డిసెంబర్ 08, 2020

మాటరాని మౌనమిది...

మహర్షి సినిమా లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మహర్షి (1987) 
సంగీతం : ఇళయరాజా 
సాహిత్యం : వెన్నెలకంటి   
గానం : బాలు, జానకి   

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
గానమిది నా ధ్యానమిది 
ధ్యానములొ నా ప్రాణమిది 
ప్రాణమైన మూగగుండె రాగమిది

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది

ముత్యాలపాటల్లొ కోయిలమ్మా 
ముద్దారపోసేది ఎప్పుడమ్మా
ఆ పాలనవ్వుల్లొ వెన్నెలమ్మా
దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌనరాగాల ప్రేమావేశం 
ఏనాడో ఒకరి సొంతం
ఆకాశదీపాలు జాబిలి కోసం 
నీకేల ఇంత పంతం
నింగి నేల కూడేవేళ 
నీకు నాకు దూరాలేలా 
అందరాని కొమ్మ ఇది 
కొమ్మచాటు అందమిది 

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మా 
గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నేలమ్మా 
నీరెండకానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణానాదం 
కోరింది ప్రణయ వేదం
వేశారు గుండెల్లొ రేగే గాయం 
పాడింది మధురగేయం
ఆకాశానా తారాతీరం 
అంతేలేనీ ఎంతో దూరం

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది 
కొమ్మచాటు అందమిది..
కూడనిదీ జతకూడనిదీ 
చూడనిదీ మదిపాడనిదీ 
చెప్పరాని చిక్కుముడి వీడనిదీ

మాటరాని మౌనమిది 
మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది
కొమ్మచాటు అందమిది
 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.