ఆదివారం, డిసెంబర్ 20, 2020

జయ జయ నారాయణా...

శ్రీ కృష్ణలీలలు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ కృష్ణలీలలు (1958)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి 
సాహిత్యం : ఆరుద్ర 
గానం : ఘంటసాల 

జయ జయ నారాయణా!
ఆ జయ దీన జనావనా ...ఓ... 
జయ జయ నారాయణా!
ఆ జయ దీన జనావనా ...ఓ... 
జయ జయ నారాయణా!

అవనిభారమే అమితమైనది 
అవతరించుమా నవరూపానా
ఆఆఆఆ...ఆఆఆ....
అవనిభారమే అమితమైనది 
అవతరించుమా నవరూపానా

అనన్యం అమోఘం 
కరుణా భరణా 
ఆర్తత్రాణపరాయణా

జయ జయ నారాయణా
ఆఆఆఅ....ఆఆఆఆ....
జయ జయ నారాయణా!
ఆ జయ దీన జనావనా
జయ జయ నారాయణా 
జయ దీన జనావనా.....ఆ...

జగతికి నీవే జనకుడవైనా
జననీ జనకుల తనయుడవై

జగతికి నీవే జనకుడవైనా
జననీ జనకుల తనయుడవై
పురుషోత్తమ యిటు 
పురిటి కందుగా 
పుట్టినాడవా పుడమిని బ్రోవ 

జయ జయ నారాయణా!
జయ జయ నారాయణా! 
జయ జయ... నారాయణా!
జయ జయ నారాయణా! 
జయ జయ నారాయణా!
జయ జయ నారాయణా!
జయ జయ నారాయణా!
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.