ఆదివారం, డిసెంబర్ 13, 2020

ఒకడే ఒక్కడు మొనగాడు...

ఓ రోజు ఆలశ్యంగా రజనీకాంత్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ముత్తు చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. లిరికల్ వీడియో లో ఆడియో క్వాలిటి బావుంది అది ఇక్కడ చూడవచ్చు. పాతికేళ్ళ క్రితం ఈ సినిమా రిలీజ్ టైంలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ రజనీకి. ఆ మ్యూజిక్ కి ఐతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేవి. 

 
చిత్రం : ముత్తు (1995) 
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్   
సాహిత్యం : భువనచంద్ర 
గానం : బాలు

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

భూమిని చీల్చే ఆయుధమేలా 
పూవుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిననాడు 
ఆనందాలే విరియును చూడు

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

సయ్య సయ్యారె సయ్యారె సయ్యా… 
హె..హె…ఎ. ఎ
సయ్య సయ్యారె సయ్యారె సయ్యా
సయ్య సయ్యారె సయ్యారె సయ్యా
సయ్య సయ్యారె సయ్యారె సయ్యా
సయ్య సయ్యారె సయ్యారె సయ్యా…ఆ…

మట్టి మీద మనిషికి ఆశ 
మనిషి మీద మట్టికి ఆశ 
మట్టి మీద మనిషికి ఆశ 
మనిషి మీద మట్టికి ఆశ 
మన్నే చివరికి గెలిచేదీ 
అది మరణం తోనే తెలిసేది
కష్టం చేసి కాసు గడిస్తే 
నీవే దానికి యజమాని
కోట్లు పెరిగి కొవ్వు బలిస్తే 
డబ్బే నీకు యజమాని
జీవిత సత్యం మరవకురా 
జీవితమే ఒక స్వప్నమురా

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

భూమిని చీల్చే ఆయుధమేలా 
పూవుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిననాడు 
ఆనందాలే విరియును చూడు
 
వాన మనదీ ప్రకృతి మనదీ 
తన పర భేదం ఎందుకు వినరా 
వాన మనదీ ప్రకృతి మనదీ 
తన పర భేదం ఎందుకు వినరా 
కాలచక్రం నిలవదురా 
ఈ నేల స్వార్ధం ఎరగదురా
పచ్చని చెట్టు పాడే పక్షి 
ఇరులు ఝరులు ఎవ్వరివి
మంచిని మెచ్చే గుణమే ఉంటే 
ముల్లోకాలు అందరివి
జీవితమంటే పోరాటం 
అది మనసుకి తీరని ఆరాటం

ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
హాఅ..
ఒకడే ఒక్కడు మొనగాడు 
ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు 
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

భూమిని చీల్చే ఆయుధమేలా 
పూవుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిననాడు 
ఆనందాలే విరియును చూడు
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.