శుక్రవారం, డిసెంబర్ 25, 2020

జీవము నీవేకదా దేవా...

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ శ్రీహరికి నమస్కరించుకుంటూ భక్త ప్రహ్లాద సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు  
సాహిత్యం : సముద్రాల  
గానం : సుశీల  

ఆదుకోవయ్యా! ఓ!  రమేశా! 
ఆదుకోవయ్యా

పతితపావన శ్రితజనావన 
సుజన జీవన మాధవా!
భువననాయక ముక్తిదాయక 
భక్తపాలక కేశవా 

ఆదుకోవయ్యా! ఓ!  రమేశా! 
ఆదుకోవయ్యా

సర్వలోక కారణా! సకలశోక  వారణా!
జన్మజన్మ కారణా! జన్మబంధ మోచనా!
దుష్టగర్వ  శిక్షణా! శిష్ట  శాంతి రక్షణా! 
శాంతి  రక్షణా!

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా దేవా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా!!

జనకుడు నీపై కినుక వహించీ 
నను వధియింప మదినెంచే
చంపేదెవరూ సమసేదెవరూ 
సర్వము నీవే కదా స్వామీ !!

నిన్నేగానీ పరులనెరుంగా!
రావే! వరదా! బ్రోవగరావే! 
వరదా! వరదా! అని మొరలిడగా 
కరివిభు గాచిన స్వామివి 
నీవుండ భయమేలనయ్యా||
జీవము నీవే కదా||

హే! ప్రభో! హే! ప్రభో!
లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా! 
కరుణా భరణా! కమల లోచన !
కన్నుల విందువు చేయగరావే ! 
అశ్రిత భవ భంధ నిర్మూలనా!
లక్ష్మీ వల్లభా! లక్ష్మీ వల్లభా

నిన్నే నమ్మీ నీ పద యుగళీ 
సన్నుతిజేసే భక్తావళికీ
మిన్నాగుల గన భయమదియేలా 
పన్నగశయనా నారాయణా

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా

మదిలో వెలిలో చీకటిమాపీ
ఆఆఅ... ఆఆఆ.అ....
మదిలో వెలిలో చీకటి మాపీ
పథము జూపే పతితపావనా!
పథము జూపే పతిత పావనా!

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా

భవజలధినిబడి  తేలగలేని, 
జీవులబ్రోచే పరమపురుషా! 
నను కాపాడి నీ బిరుదమునూ  
నిలువుకొంటివా శ్రితమందార

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా

విశ్వమునిండీ వెలిగే నీవే 
నాలోనుండీ నన్నుకావగా!
విషమునుద్రావా వెరువగనేలా 
విషధర శయనా! విశ్వపాలనా!

జీవము నీవేకదా దేవా 
జీవము నీవేకదా 
బ్రోచే భారము నీదే కదా 
నా భారము నీదే కదా
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.