శుక్రవారం, డిసెంబర్ 18, 2020

మేలుకో శ్రీరంగా...

విప్రనారాయణ సినిమాలోని ఒక చక్కని మేలుకొలుపు గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తిపాట ఆడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : విప్రనారాయణ (1954)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల సీనియర్ 
గానం : ఏ. ఎం. రాజా  

కౌసల్యా సుప్రజా రామ 
పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం 
దైవమాహ్నికమ్‌ 

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద 
ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాన్త 
త్రైలోక్యం మంగళం కురు

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు
వెదజల్లె నెత్తావి విరబూచి విరులు
విరితేనెలాని మైమరచు తుమ్మెదలు
లేచెను విహగాళి లేచెను నిదురా

చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు
రేయి వేగినది వేళాయె పూజలకు

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

పరిమళ ద్రవ్యాలు బహువిధములౌ 
నిధులు గైకొని దివ్యులు
కపిలధేనువును అద్దమ్ముపూని 
మహర్షి పుంగవులు
మురువుగా పాడ 
తుంబురు నారదులును
నీ సేవకై వచ్చి నిలచియున్నారు
సకుటుంబముగ సురేశ్వరులు
కానుకలు గైకొని 
మొగసాల కాచియున్నారు 

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

దేవరవారికై పూవుల సరులు తెచ్చిన
తొండరడిప్పొడి మురియ
స్నేహదయాదృష్టి చిల్కగా జేసి
పెద్దను విడి కటాక్షింప రావయ్యా

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
 

2 comments:

జయ ముకుంద..జయ మురారి..

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.