మంగళవారం, ఏప్రిల్ 14, 2020

సామజవరగమనా...

లాయర్ సుహాసిని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లాయర్ సుహాసిని (1987)
సంగీతం : బాలు
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, శైలజ 

సామజవరగమనా
దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా

దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా

అరవిరిసిన చిరునగవుల
సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు
సామజవరగమనా
అరవిరిసిన చిరునగవుల
సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు
సామజవరగమనా
సొగసులమణి నిగనిగమని
సామజవరగమనా
మెరిసిన గని మురిసెనుమది
సామజవరగమనా
వెలసెను వలపుల మధువని
సామజవరగమనా

దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా

మమతల ఉలి మలచిన కల
సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల
సామజవరగమనా
మమతల ఉలి మలచిన కల
సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల
సామజవరగమనా
సుగుణములను తరగని గని
సామజవరగమనా
దొరికినదని ఎగసెను మది
సామజవరగమనా
అరుదగు వరమిది తనదని
సామజవరగమనా

హ..హా...
దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా  
 


5 comments:

సామజ వర గమనా పల్లవిని మన తెలుగు సినిమాలలో మూడు నాల్గు పాటలలో వాడుకున్నారు.

సామజ వర గమనా అంటే ఒక పెద్ద ఏనుగు వంటి ఠీవితో నడక కలిగిన వాడు అనే అర్థం చెప్పారు.


సామజ వర గమనా ఎన్నియల్లో ఎన్నియల్లో అనే ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం లో ఒక పాట ఉంది. ( బాలకృష్ణ సౌందర్య). ఈ పాట మధ్యలో సామజ సామజ అని కొరస్ వస్తుంది. అంటే ఏనుగు ఏనుగు అని అర్థం.


అలవైకుంఠ పురి సినిమాలో హీరోయిన్ ఏనుగు లాగా ఉండదు కానీ సామజ వర గమనా అని వ్రాశారు.

లాయర్ సుహాసిని పాటలో సామజ వర గమనా పదం ఎందుకు వాడారో తెలియదు.

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ జికెకె గారూ.. నిజమేనండీ ఈ మాటను మూడు నాలుగు పాటల్లో వాడారు అన్నీ సూపర్ హిట్సే బహుశా అదో సెంటిమెంట్ అయుండచ్చండీ :-) అలాగే ఏనుగుతో పోలిక కన్నా మందగమన అనే అర్ధంలో వాడి ఉండొచ్చండి. ఇక ఈ పాట వంశీ గారిది కదా బహుశా ఆయన ఏమైనా యాడ్ చేసి ఉండచ్చు హీరోయిన్ ఒకే పదం పాడడం లాంటి ఎఫెక్ట్ కోసం.

ఆలోచిస్తుంటే మరో విషయం తట్టిందండీ.. కుదిరితే యూట్యూబ్ లో ఏనుగు నడుస్తున్న వీడియోలు చూడండి అమ్మాయిల్లా అడుగులు క్రిస్ క్రాస్ గా వేస్తూ నడుస్తాయి. బహుశా అదీ ఓ రీజన్ అయుండచ్చు కవులు ఇలా పోల్చడానికి :-)

అవును వేణు శ్రీకాంత్ గారు. గజ గమన అని అంటూ ఉంటారు. sv కృష్ణా రెడ్డి గారి పాటలు, చిలక ఏ తోడులేక, జాగోరే బేతాళ , ఉడతా ఉడతా ఊచి పాటలు చాలా బాగుంటాయి. అవి కూడా ఎప్పుడైనా ఇవ్వండి.

తప్పకుండా ఇస్తానండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.