బుధవారం, ఏప్రిల్ 29, 2020

సాపాటు ఎటూ లేదు...

ఆకలిరాజ్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆకలి రాజ్యం (1980)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

హే హే హే హే హే హే హేహే ఏ ఏహే
రు రు రు రు రూరు రూ రూ రురు

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్ 

 
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా

డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పుచ్చుకొని
ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్ 

 
బంగారు పంట మనది
మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా
ఇంట్లో ఈగల్ని తోలుదామురా

ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా

ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా... ఆ.. ఆ..
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ 

 
సంతాన మూలికలము
సంసార బానిసలము
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు
సంపాదనొకటి కరువురా

చదవెయ్య సీటు లేదు చదివొస్తే పనీ లేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్ 


7 comments:

నిరుద్యోగ యువత ఆవేదన ప్రతిబింబించిన సాహిత్యం ఈ పాటలో ఉంది.

అవునండీ.. ముందు ముందు మళ్ళీ అప్పటంత తీవ్రమైన పరిస్థితులు వచ్చేలా ఉన్నాయ్ చూడబోతే.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

“కరోనా” ప్రభావం పడినా పడవచ్చు ఉద్యోగాల మీద.

ఇదే సినిమా లోని “ఓ మహాత్మా, ఓ మహర్షీ” అనే పాటను (శ్రీ శ్రీ గారిది) కూడా ఇక్కడ present చెయ్యరాదూ, వేణూశ్రీకాంత్ గారూ?

నా ఉద్దేశ్యం కూడా అదే నరసింహారావు గారు.. ఈ ఎఫెక్ట్ దదాపు ఒక ఏడాది పాటు ఉండచ్చు.
ఓ మహాత్మ పాట ఆల్రెడీ బ్లాగ్ లో పబ్లిష్ చేశానండీ.. ఇదిగోండి లింక్..
https://sarigamalagalagalalu.blogspot.com/2014/12/blog-post_24.html

మీరిచ్చిన లింక్ చూశాను. బాలచందర్ గారు అస్తమించిన సందర్భంగా ఈ పాట పోస్ట్ చేశారన్నమాట 🙏. Very thoughtful and appropriate 👌.

థ్యాంక్స్ నరసింహారావు గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.