మంగళవారం, ఏప్రిల్ 28, 2020

నీ తీయని పెదవులు...

కాంచనగంగ చిత్రంలోని ఒక రొమాంటిక్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. నా టీనేజ్ రోజుల్లో మా ఇంటి దగ్గర లోని సినిమా హాల్ రిక్షాబండి వాడు పేద్ద సౌండ్ తో తెగ వినిపించేసేవాడీ పాటను. ఇప్పటికీ ఈ పాట వింటూంటే ఆ రోజుల్లో పబ్లిక్ లో వినలేక పడిన ఇబ్బంది గుర్తొచ్చి నవ్వొస్తుంటుంది. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో దొరకలేదు ఎంబెడెడ్ యూట్యూబ్ ఆడియో ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం : కాంచన గంగ (1984)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : సినారె
గానం : బాలు, జానకి

ఆఆఅఆఆఅ...ఆఆహాహా...
నీ తీయని పెదవులు
అందకపోతే నిదరే రాదమ్మా
లలలలా లలలాలాలా లలలల
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే
కలలే రావమ్మా
లలాలలా లా ఆ ఆ ఆ...
నీవే నీవే నా ఆలాపనా
నీలో నేనే ఉన్నా

నీ తీయని పెదవులు
అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే
కలలే రావమ్మా

నీ అందమే అరుదైనదీ
నా కోసమే నీవున్నదీ
హద్దులు చెరిపేసి
చిరుముద్దులు కలబోసీ
హద్దులు చెరిపేసి.. హ..
చిరుముద్దులు కలబోసీ.. ఆహ్..
పగలూ రేయి
ఊగాలమ్మా పరవళ్ళలో

నీ తీయని పెదవులు
అందకపోతే నిదరే రాదమ్మా
లలలలా లలలాలాలా లలలల

నీ కాటుక కళ్ళే నవ్వకపోతే
కలలే రావమ్మా
లలాలలా లా ఆ ఆ ఆ.. 

ఆ... ఆ... ఆ...
ఏ గాలులూ నిను తాకినా
నా గుండెలో ఆవేదనా.. ఆహ్..
వలపే మన సొంతం
ప్రతిమలుపూ రసవంతం
వలపే మన సొంతం ఆహా..
ప్రతిమలుపూ రసవంతం హహహ.
కాగే విరహం 
కరగాలమ్మా కౌగిళ్ళలో.. ఆహ్..

నీ తీయని పెదవులు
అందకపోతే నిదరే రాదమ్మా.. ఆహ్.హ్హ.హ.

నీ కాటుక కళ్ళే నవ్వకపోతే
కలలే రావమ్మా.. హహహ..
నీవే నీవే నా ఆలాపనా
నీలో..ఆహ్.. నేనే..హహ.. 
ఉన్నా.. ఉహ్.హ్..

నీ తీయని పెదవులు
అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే
కలలే రావమ్మా
ఆహ్... 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.