ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఎవ్వరికీ చెప్పొద్దు (2019)
సంగీతం : శంకర్ శర్మ   
సాహిత్యం : వాసు వలభోజు 
గానం : హరిశంకర్, షాషా తిరుపతి
ఔనా నిజమేనా నిజమేనా మనసా
ఔనా నిజమేనా ఇది నిజమా
ఏదో జరిగిందా మరి ఏంటీ వరసా
కొంచెం మరి కొంచెం నను మరిచా 
ఇది కొంచెం కలగా మరికొంచెం నిజంగా
అనిపించే నిముషం నువు మాటే వినవుగా 
చిరునవ్వై మెరిసావే మరి మనసా 
మరి మనసా
ఔనా నిజమేనా నిజమేనా మనసా
ఔనా నిజమేనా ఇది నిజమా
ఏదో జరిగిందా మరి ఏంటీ వరసా
కొంచెం మరి కొంచెం నను మరిచా 
నామాట కొంచెం వినే పనే లేదా 
గిరిదాటి వెళతావే మనసా 
మరీ అలా దాన్ని అణిచేసి ఉంచే 
తలపైనా పొరపాటే తెలుసా
నా చూపుదాటి మరి మనసెళ్ళిపోయే 
ఈ రోజు తోటీ తన కథ మారిపోయె 
ఇది నమ్మలేని వింతగుంది గానీ 
ఆపలేని ఇంత సంతోషాన్ని 
ఒక్కసారి పొందమన్న గానీ 
సులువా సులువా
మరి చూపులోని చిన్న సంశయాన్ని 
చిన్న నవ్వు నెట్టివేస్తె గానీ 
తాకలేవు నువ్వు అంబరాన్ని 
తెలుసా మనసా
హాఆ ఊహలపైనా అడుగేసి నేనే 
నడిచానే తొలిసారైనా బాగుందే 
ఆశలు దాటి పరుగందుకుంటే 
నువ్వు కన్న కల నీకు సరిపోదె 
ఇన్నాళ్ళు లోకం మరి నను చూడలేదా 
నీ చేయి చాస్తే మరి తను అందలేదా 
ఇది కొత్త మార్పు కొత్తగుంది గానీ 
కొత్త దారి చూపుతోంది గానీ 
కొత్తబంధమింత దగ్గరైతే 
గొడవే మనసా 
ఇది తప్పలేదు తప్పు కాదు గానీ
ముచ్చటేగ ముప్పు లేదు గానీ 
నిన్ను నీకు చూపుతాను గానీ
పదవే మనసా.. 
ఔనా నిజమేనా నిజమేనా మనసా
ఔనా నిజమేనా ఇది నిజమా
ఏదో జరిగిందా మరి ఏంటీ వరసా
కొంచెం మరి కొంచెం నను మరిచా 
ఇది కొంచెం కలగా మరికొంచెం నిజంగా
అనిపించే నిముషం నువు మాటే వినవుగా 
చిరునవ్వై మెరిసావే మరి మనసా మరి మనసా
ఔనా నిజమేనా నిజమేనా మనసా
ఔనా నిజమేనా ఇది నిజమా
ఏదో జరిగిందా మరి ఏంటీ వరసా
కొంచెం మరి కొంచెం నను మరిచా 
 
 


 
 



 
 
2 comments:
ఇలాంటి మూవీస్ యెప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాయో తెలీక పోవడం వల్ల కొన్ని మంచి మెలొడీస్ మిస్ ఔతున్నాము..థాంక్యు ఫర్ షేరింగ్..
నిజమేనండీ.. నిజానికి ఈ సినిమా కూడా బానే ఉంటుందండీ.. ప్రైమ్ లో ఉంది వీలైతే చూడండి.. టైమ్ పాస్ మూవీ.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.