ఆదివారం, జనవరి 05, 2020

తిరుప్పావై 21 ఏత్త కలంగళ్...

ధనుర్మాసం లోని ఇరవయ్యొకటవ రోజు పాశురము "ఏత్త కలంగళ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
వరదలై పొంగ కుండలా
పాలు గురియూ
పశువులు గల సామి
నందగోపాలు తనయా
మేలుకోవయ్యా
లోకాల మేలుకొరకు

జగతి వెలిసినయట్టి
తేజ స్వరూపా
చేయుచున్నట్టి
మా నోము చిత్తగించు


రాజసము వీడి
శరణమ్ము రాజులట్లు
మంగళములను
పాడుచు మాననీయా

పట్టుకొందుము
పాద పద్మమ్ములను
పట్టుకొందుము
నీ పాద పద్మమ్ములను

    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఇరవయ్యొకటవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప,
మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుం పశుక్కళ్,
ఆత్తప్పడైతాన్ మగనే! అఱివుఱాయ్.
ఊత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిన్ఱ శుడరే! తుయిలెழாయ్
మాత్తారునక్కు వలి తొలైందు ఉన్ వాశఱ్కణ్,
ఆత్తాదువన్దు ఉన్నడి పణియుమాపోలే,
పోత్తియామ్ వన్దోమ్ పుకழ்న్దేలో రెమ్బావాయ్

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఇరవయ్యొకటవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా
నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా


పొదుగు కిందా కడవలుంచిన
పొంగి పొరలగ పాలు ఇచ్చిన
అందమైనా బలము గల్గిన
ఆలమందల ఆస్తి పొందిన

నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా


రాజ్యమెంతయి కలిగినోడా
అప్రమత్తుగా ఉండువాడా
లోకమందున జన్మనెత్తిన
జ్యోతిరూపా నిదురలెమ్ము

నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా


శత్రువులు నీ శక్తినీ గని
శరణమొసగెడి వాడవీవని
చరణపద్మములాశ్రయించిన
చందమున మేమొచ్చినామురా

నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా


నిన్ను వీడి వుండలేమని
అన్నియు వదిలేసి పదముల
ఆశ్రయించి స్తుతిని సల్పుతు
మంగళమ్ము పాడుచుందుము

నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా
నందగోపుని తనయుడా
నవ్వుచూ మేల్కొనుమురా

 

2 comments:

విశ్వాధారా..సర్వాధారా

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.