శుక్రవారం, జనవరి 17, 2020

ప్రతిరోజు పండగే...

ప్రతిరోజు పండగే చిత్రంలోని ఒక చక్కనైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రతిరోజు పండగే (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కె.కె.
గానం : శ్రీకృష్ణ

మెరిసాడే మెరిసాడే
పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే
తనవారే వస్తుంటే
అలుపింక మరిచాడే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది
తెల్లారి నీ నవ్వుతోనే

పదిమంది ఉండగా
ప్రతిరోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతి రోజు పండగే

మెరిసాడే మెరిసాడే
పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే
సరదాలో మునిగాడే

గలగల మాటల సడిలో
బరువిక తేలిక పడెలే
ఇరుకుగ మారితె గదులే
చురుకుగ ప్రాణమే కదిలే
మనమంతా కలిసుంటే
కలతున్నా మరిచేనే
మనమంతా వెనకుంటే
మరణాన్నే గెలిచేనే

మిము కలవగా తెగ కలవరం
అసలిది కదా ఒక సంబరం
ఒక వరసలా కదిలిన క్షణం
ఇక తెలియదే ఒంటరితనం

ఎన్నాళ్ళకో రారు కన్నోళ్ళిలా
వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా
ఇల్లంతా మారింది సందళ్ళుగా
మీరంతా ఉండాలి వందేళ్ళిలా

మనవారే వెనకుంటే
మరణాన్నే మరిచేలే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది
తెల్లారి నీ నవ్వుతోనే

పదిమంది ఉండగా
ప్రతిరోజు పండగే
పడి నవ్వుతుండగా
ప్రతిరోజు పండగే


2 comments:

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.