శుక్రవారం, జనవరి 24, 2020

ఏమో ఏమో ఏ గుండెల్లో...

ఎంతమంచి వాడవురా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఎంత మంచి వాడవురా (2019)
సంగీతం : గోపి సుందర్  
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : బాలు

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం

చేయందుకుందాం చిగురంత ధైర్యమై
భరోసానిద్దాం పద మనో బలమై
మనుషులం మనందరం
ఏకాకులం కాదే ఎవ్వరం
మంచితనం మన గుణం
పరస్పరం సాయం కాగలం

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం

ఏ రక్త బంధం లేకున్నా గాని
స్పందించగలిగిన స్నేహితులం
ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా
అందించగలిగిన వారదులం
ఓ గుండె నిప్పును ఆర్పడం
ఆపడం కదా ఉపకారం
వేరెవరి హాయికో జోలాలి
పాడడం ఆహా ఎంత వరం

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం

ఖాళీలెన్నెన్నో పుట్టించేస్తుంది
ఖాళీగా ఉండలేని కాలమిది
మనసైనదాన్ని మాయం చేస్తుంది
తప్పించుకోలేని జాలమిది
ఆలోటు తీర్చగా
ఇపుడూ ఎపుడూ
మనం ముందుందాం
కష్టాల బరువును తేలికపరిచే
భుజం మనమవుదాం

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం

2 comments:

యెన్ని వేల గొంతులొచ్చినా..బాలుగారి పాట ఈ రోజుకీ అమృతమే..

అంతేకదండీ.. సందేహమేలేదు అందులో.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.