బుధవారం, జనవరి 01, 2020

తిరుప్పావై 17 అమ్బరమే తణ్ణీరే...

మిత్రులందరకూ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ధనుర్మాసం లోని పదహేడవ రోజు పాశురము "అమ్బరమే తణ్ణీరే". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
అన్న వస్త్రంబులున్
చల్లనైన నీరు
దానమిడు నందగోపాల
దయను లెమ్ము

వనితలందరికి
ఆదర్శ వనితవైన
ఓ యశోదమ్మా మేలుకో


ఒకట విరిగి మూడు లోకాల
కొలిచిన మూల దేవా
మేలుకోవయ్యా బలరామా

మేము నోము చేయ
తమ్ముని గూడి
వేంచేయుమయ్యా 

    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదిహేడవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
అమ్బరమే! తణ్ణీరే! శోఱే! అఱమ్ శెయ్యుమ్,
ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎழுన్దిరాయ్,
కొమ్బనార్కెల్లామ్ కొழுన్దే! కులవిళక్కే!
ఎమ్బెరుమాట్టి! యశోదా! అఱివుఱాయ్,
అమ్బర మూడఱుత్తు ఓంగి ఉలగళన్ద,
ఉమ్బర్ కోమానే! ఉఱంగా దెழுన్దిరాయ్
శెమ్ పొఱ్కழలడి చ్చెల్వా! బలదేవా!
ఉమ్బియుమ్ నీయు ముఱంగేలో రెమ్బావాయ్

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదిహేడవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


రవ్వల చెట్టువై పడతులలో చిగురువై
నిబ్బరంబగు గొల్లవంశ మణిజ్యోతివై
నందుని ప్రియసుతుని అందాల ఓరాశి
ముందుగ స్వామిని మేల్కొల్పుమా తల్లీ

కోరినంతనే వలువలందించువాడు
నీరుకావాలన్నా అమృతమిచ్చెడి వాడు
భక్తినేదడిగిన లేదనక ఇచ్చునూ
ముక్తినొసగెడి మా నంద గోపాలునీ


భూమి ఆకాశముల కొలచి మూడడుగుల
ప్రేమతో బలిని పూని బ్రోచిన వామన
నిత్య శూరుల భక్తి ముక్తి సంధాయక
నిదురింక చాలించి మేలుకొనవయ్యా

మిడిసిపోయెడి ఇంపు సొంపైన బంగారు
కడియము కాలుకు వేసిన బలరామ
పడక మంచమునొదలి ప్రభును లెమ్మనుమా
పుడమిపై భానుడు పొడుచుకొచ్చెను సుమ్మా


రవ్వల చెట్టువై పడతులలో చిగురువై
నిబ్బరంబగు గొల్లవంశ మణిజ్యోతివై
నందుని ప్రియసుతుని అందాల ఓరాశి
ముందుగ స్వామిని మేల్కొల్పుమా తల్లీ  



 

2 comments:

బిలేటెడ్ హాపీ న్యూ యియర్ అండి..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.