కథనం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కథనం (2019)
సంగీతం : ఘనశ్యామ్    
సాహిత్యం : ఘనశ్యామ్  
గానం : రమ్య బెహ్రా 
నా చిరు కనులె నిను వెతికే 
నా చిరు ఆశే నిను పిలిచే 
ఆశలన్నీ చెదిరే ఆయువంతా తరిగే 
ఆపినా ఆగదే నాలో ఆవేదనా 
దాచినా దాగదే నాలో ఆరాధన 
నన్ను విడిచి ప్రాణమే నిన్ను చేరెనే 
నిన్ను తలచి దేహమే నన్ను మరిచెనే 
నా చిరు కనులె నిను వెతికే 
నా చిరు ఆశే నిను పిలిచే 
కన్నుల్లో జలపాతం సంద్రాలై పొంగేనులే 
గుండెల్లో ప్రియ గీతం మౌనాలై పాడేనులే 
తనని మరచి కెరటాలే ఎంత పైకి లేచినా 
గీత దాటి ఎపుడైనా కడలినొదిలి వచ్చునా
ఏటిలో నావలా ఒంటరయ్యానుగా
గూటిలో గువ్వలా మిగిలిపోయానుగా
విధిరాసే ఈ కథనం ఎదురై నిలిచెనుగా
నా చిరు కనులె నీకై వెతికేలే 
నా చిరు ఆశే నిన్నే పిలిచేలే 
మనసుల్లో తడబాటే ఎడబాటే చేసిందిలే 
నడిచేటీ పూలబాటే ముళ్ళ బాటై సాగిందిలే 
కారు మబ్బులెన్ని కమ్ముకున్న వేళా 
కాంతినిచ్చు సూర్యుడే మసకబారి పోయెనా
లోకమంత చీకటై దారి తెలియకున్నా 
దీపమంత ధూపమై దిక్కుతోచకున్నా
తలరాతే మార్చేసే మార్గం ఉంటుందా 
నా చిరు కనులె నీకై వెతికేలే 
నా చిరు ఆశే నిన్నే పిలిచేలే
 


 
 



 
 
2 comments:
చాలా ఎక్స్ ప్రెసివ్ గా ఉంది రమ్య వే ఆఫ్ సింగింగ్..
అవునండీ.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.