ఆదివారం, జనవరి 19, 2020

సూర్యుడివో చంద్రుడివో...

సరిలేరు నీకెవ్వరూ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రొజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సరిలేరు నీకెవ్వరూ (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : బి.ప్రాక్

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల
ఆనందమాయే హొయ్యా
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల
చిరునవ్వు చేరే హొయ్యా

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరీ కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరీ కన్న కలవో
విశ్వమంతా ప్రేమ పండించగా
పుట్టుకైన ఋషివో
సాటివారికై నీవంతుగా
ఉద్యమించు కృషివో
మా అందరిలో ఒకడైన మనిషివో

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరీ కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరీ కన్న కలవో

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల
ఆనందమాయే హొయ్యా
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల
చిరునవ్వు చేరే హొయ్యా

గుండె లోతులో గాయం
నువ్వు తాకితే మాయం
మండువేసవిలో పండు వెన్నెలలా
కలిసింది నీ సహాయం

పొలమారే ఆశల కోసం
పొలిమేరలు దాటొచ్చావు
తలరాతలు వెలుగయ్యేలా
నేనున్నానన్నావు
అడగందే అక్కర తీర్చే
నీ మంచిని పొగడాలంటే
మాలో పలికే మాటలు చాలవు

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరీ కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరీ కన్న కలవో

దేవుడెక్కడో లేడు
వేరే కొత్తగా రాడు
మంచి మనుషులలో
గొప్ప మనసు తనై
ఉంటాడు నీకు లాగా

ఏ లోక కల్యాణాన్ని
ఆశించి జన్మిచ్చిందో
నిను కన్న తల్లి కడుపు
నిండారా పండింది
నీలాంటి కొడుకుని మోసే
ఈ భూమి భారతి సైతం
నీ పయనానికి జయహో అన్నది

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరీ కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరీ కన్న కలవో

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల
ఆనందమాయే హొయ్యా
తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల
చిరునవ్వు చేరే హొయ్యా 
 

4 comments:

పాట బాగుంది. పల్లవి హంసధ్వని రాగం లో ఉంది. సాహిత్యం బాగుంది.

థాంక్స్ అజ్ఞాత గారు..

ఈ మధ్యకాలం లో వచ్చిన వన్ అప్ఫ్ ద బెస్ట్ సాంగ్స్..

అవునండీ.. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.