శుక్రవారం, మార్చి 22, 2019

అయామ్ వెరీ సారీ...

నువ్వే నువ్వే చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నువ్వే నువ్వే (2002)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.కె.

అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో పెదాలలా బిగించీ
శపించకే మరీ మంత్రాలవీ జపించీ
వదిలెయ్ క్షమించీ..
అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా
అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా
ఫారెక్స్ బేబీ టైపా లౌలీ లాలి పాప్పా

అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి


తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా
అని అడిగావనుకో చెబుతా వింటావా మరి
తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా
అని అడిగావనుకో చెబుతా వింటావా మరి
సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ ప్రతీ రుతువుకో
డిఫరెన్సూ ఉన్నప్పుడే కద బాగుంటుంది
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ మరో కలర్ రాదా
అని డౌటుపుట్టి అదె తీర్చుకుందుకే
తమాషాగా ట్రైలేసి చూశానే బేబే

అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హే అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి


లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
లిప్స్టిక్ అవసరమైనా లేనంత ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
టొమేటో పళ్ళకి డూపుల్లా సుమారు సిమ్లా యూపిల్లా
ఉన్నావే పిల్లా నువు నిలువెల్లా
నీ బంగమూతితో పొంగనీయకే బుగ్గలు బర్గర్లా
నన్నుండనీక ఊరించితే అవి
నిజం చెప్పు నీ తప్పు కాదా అదీ...

అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ అయామ్ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో పెదాలలా బిగించీ
శపించకే మరీ మంత్రాలవీ జపించి
వదిలెయ్ క్షమించి 

 

2 comments:

శ్రేయ చాలా బావుంటుందీ పాటలో..

అవును శాంతి గారూ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.