మంగళవారం, మార్చి 12, 2019

ఆనందాలే కన్నుల్లోనే...

లవర్స్ డే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లవర్స్ డే (2019)
సంగీతం : షాన్ రహ్మాన్
సాహిత్యం : చైతన్య ప్రసాద్   
గానం : రేవంత్  

ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించిందీ ఈ కాలం

నేన్నీతో కలిసున్నా
నువ్వు నాతో కలిసున్నా
అనురాగం తేనల్లే వర్షించెలే
విరిబాల నువ్వైతే
దరిచేరే తుమ్మెదనై
నా మనసే నీ చెవిలో వినిపించేలే

ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించిందీ ఈ కాలం

రోజాలే పూస్తున్నవో
ఇలా రమ్యంగా చూస్తున్నవో
నేనిట్టా నీతో ఉంటే
చూపులిలా చిత్తరువైపోతున్నావో
కాలం కే ఏమయ్యిందో
నవ వాసంతం పోనందో
నీ చూపే నన్నే తాకి
గుండెల్లో ప్రేమల్లే పూస్తున్నదో
దారం లేని గాలి పటమై
హృదయం నేడే ఎగిరెనే
నువ్వే లేని వేళల్లోన
ఊహల్లోనా తేలానే

ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించిందీ ఈ కాలం

నేన్నీతో కలిసున్నా
నువ్వు నాతో కలిసున్నా
అనురాగం తేనల్లే వర్షించెలే
విరిబాల నువ్వైతే
దరిచేరే తుమ్మెదనై
నా మనసే నీ చెవిలో వినిపించేలే

ఆనందాలే కన్నుల్లోనే
పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే
ఆడించిందీ ఈ కాలం

2 comments:

ప్రియా వారియర్ ఈజ్ యే గుడ్ సింగర్..
https://www.youtube.com/watch?v=R4LIY_Gpy98

ఓహ్ థాంక్స్ ఫర్ షేరింగ్ శాంతి గారు.. నిజమే బాగా పాడుతుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.