శుక్రవారం, మార్చి 01, 2019

కళాశాలలో... కళాశాలలో...

మార్చ్ అనగానే పరీక్షలు ఆ పై ఫేర్వెల్ పార్టీలు ఇలా ఎక్కడ చూసినా స్టూడెంట్స్ హడావిడే కనిపిస్తుంటుంది. అందుకే ఈ నెలంతా సరదాగా కాలేజ్ చుట్టూ తిరిగే పాటలు కొన్ని తలచుకుందాం. ముందుగా కొత్తబంగారులోకం చిత్రంలోని ఒక చక్కని పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కొత్తబంగారు లోకం (2008)
సంగీతం : మిక్కీ జె.మేయర్ 
సాహిత్యం : శ్రీకాంత్ అడ్డాల 
గానం : కృష్ణచైతన్య, ఆదిత్య, క్రాంతి,
శశికిరణ్, సిద్దర్థ్

కళాశాలలో... కళాశాలలో...
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
కలలు ఆశలు కలిసిన ప్లేసులు
నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు
పుస్తకమన్నది తెరిచే వేళా
అక్షరమెనుక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూఉంటే
దాటేటందుకు మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగశాల
కాదా మనసొక ప్రయోగశాల

కళాశాలలో... కళాశాలలో...
కళాశాలలో... కళాశాలలో...

సౌండ్ గురించి చదివాము
హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు
లైట్ గురించి చదివాము
నీ కళ్ళ రిజల్టు తెలియలేదు
మాగ్నటిక్స్ చదివాము
ఆకర్షణేంటో తెలియలేదు
విద్యుత్ గురించి చదివాము
ఆవేశం ఏంటో తెలియలేదు
ఫిజిక్స్ మొత్తం చదివినా
అర్దం కాని విషయాలన్ని
నీ ఫిజిక్ చూసిన వెంటనె
అర్దం ఐపోయాయే

కళాశాలలో... కళాశాలలో...
కళాశాలలో... కళాశాలలో...

లోలకం లాగా ఊగుతూ సాగే 
మీ నడుములన్ని
స్క్రూగేజ్ తోనే కొలిచేయలేమా
గాలికే కందే మీ సుకుమార 
లేత హృదయాలు
సింపుల్ బాలన్స్ తూచేయలేదా
న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య
మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా
మా వైపు చూడకపోతే చాలా తప్పేగా
క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే

పుస్తకమన్నది తెరిచే వేళా
అక్షరమెనుక దాక్కొని ఉంది
కళ్ళతొ వంతెన కడుతూఉంటే
దాటేటందుకె మతి పోతుంటే
కాదా మనసొక ప్రయోగశాల
కాదా మనసొక ప్రయోగశాల
కళాశాలలో... కళాశాలలో...
కళాశాలలో... కళాశాలలో...


3 comments:

స్వీట్ మెమొరీస్:-)

నిజంగా నేనేనా పాట కూడా చాలా బావుంటుందీ మూవీలో..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. అవునండీ.. అసలు అదొక్కటే కాదు ఈ ఆల్బమే సూపర్ హిట్ అప్పట్లో..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.