సోమవారం, మార్చి 04, 2019

నమో నమో తాండవకేళీ లోలా...

ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం సందర్బముగా ఆ పరమశివునికి నమస్కరించుకుంటూ వినాయక విజయం చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : వినాయక విజయం (1979)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, కోరస్

ఓంకార నాద ప్రణవాంకిత జీవనాయ
సాకార రూప నిఖిలాంతర చిన్మయాయ
కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయా
హరాయ.. శుభకరాయ.. నమశ్శివాయ

నమశ్శివాయా.. నమశ్శివాయా.. నమశ్శివాయా

నమో నమో తాండవకేళీ లోలా
నమో నమో తాండవకేళీ లోలా
నమో నమో ఆశ్రిత జనపాలా
నమో నమో ఆశ్రిత జనపాలా
నమో నమో తాండవకేళీ లోలా

దయా కిరణముల  ప్రసరించే
నీ చూపుల సుమధుర భావనలు
ఈ జగతికె చల్లని దీవెనలు

నమో నమో తాండవకేళీ లోలా

అలనాడు అమృతమును ఆశించి
పాలకడలి మధియించగా
అలనాడు అమృతమును ఆశించి
పాలకడలి మధియించగా 

హాలాహలమే ప్రభవించి
విషజ్వాలలే వెదజల్లగా
హాలాహలమే ప్రభవించి
విషజ్వాలలే వెదజల్లగా 

అభయమొసంగి గరళము మింగి
అభయమొసంగి గరళము మింగి
జగముల కాచిన జగదీశా పరమేశా

నమో నమో తాండవకేళీ లోలా

పృధివి రధముగా
రవిచంద్రులె చక్రాలుగా
నాల్గు వేదములె హయములుగా
బ్రహ్మదేవుడే సారధిగా
మేరుపర్వతమె విల్లుగా
శ్రీహరి అస్త్రము కాగా

ప్రళయకాల పర్జన్య గర్జనగ
భీషణ శంఖము పూరించి
ప్రళయకాల పర్జన్య గర్జనగ
భీషణ శంఖము పూరించి

పాశుపతమ్మును సంధించి
త్రిపురాసురులను వధియించీ
పాశుపతమ్మును సంధించి
త్రిపురాసురులను వధియించీ

లోకాలను గాచిన దేవా
మా శోకము మాపిన మహానుభావా
లోకాలను గాచిన దేవా
మా శోకము మాపిన మహానుభావా

నమో నమో తాండవకేళీ లోలా
నమో నమో ఆశ్రిత జనపాలా
నమో నమో తాండవకేళీ లోలా

2 comments:

శివరాత్రి శుభాకాంక్షలండి..

థాంక్స్ శాంతి గారు.. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.