సోమవారం, సెప్టెంబర్ 10, 2018

పెళ్ళంటే నూరేళ్ళపంట...

మీనా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మీనా (1973)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : దాశరథి
గానం : బాలు

పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట... ఆ
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
బంధాలను తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని.
అడుగు ముందుకేశావమ్మా. గడప దాటి కదిలావమ్మా
పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా... ఆ

మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు
ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు
మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు
ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు

మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు
మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు
అందుకే. తిరుగుబాటు చేసేరు పిల్లలు

పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా...

మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు
ఎవ్వరికీ. పనికిరారు ...ఏమి చేయలేరూ
మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు
ఎవ్వరికీ. పనికిరారు... ఏమి చేయలేరూ

అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు
అపనిందలపాలవుతూ. అలమటించుతారు
అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు
అపనిందలపాలవుతూ. అలమటించుతారు

పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
పెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంటా...

మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా
మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా
ఎలా కుదురుతుందీ. ఇది ఎలా జరుగుతుందీ.

కలిమి కాదు మగువకు కావలసిందీ...
కలిమి కాదు మగువకు కావలసిందీ...
మనసిచ్చిన వానితో. మనువు కోరుకుందీ
మనసిచ్చిన వానితో. మనువు కోరుకుందీ.
మనువు కోరుకుందీ.

పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంట
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
బంధాలని తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని.
అడుగు ముందుకేశావమ్మా. అడుగు ముందుకేశావమ్మా
పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా... ఆ


2 comments:

యెన్ని సార్లు చదివినా బోర్ కొట్టని నవల మీనా..ఆ నవలని అంత అందగానూ తీసిన విజయనిర్మల గారికి హాట్సాఫ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.