శుక్రవారం, మార్చి 03, 2017

హల్లో మై రీటా...

వయసుపిలిచింది సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వయసు పిలిచింది (1978)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వీటూరి
గానం : బాలు

మాటే మరచావే..చిలకమ్మ..మనసువిరిచావే 
అంతట నీవే కనిపించి..అలజడి రేపావే
కమాన్ క్లాప్స్..
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ

హల్లో మై రీటా ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ

నీ పెదవులు..చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం..పాదరసం
నీ పెదవులు..చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం..పాదరసం
నాలో రేపావూ..ఊ..జ్వాల
ఒకరితో పాడేవూ..ఊ..జోల
నను మరచి పోవడం..న్యాయమా
మనసమ్మినందుకు నమ్మినందుకు 
వలపు గుండెకే..గాయమా
కథలే మారెను కలలే మిగిలెను హే..ఏయ్

హల్లో మై రీటా ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ

ప్రేమన్నది..దేవుని కానుక
అది నీకు కేవలం..వేడుక
ప్రేమన్నది..దేవుని కానుక
అది నీకు కేవలం..వేడుక
కృష్ణుడు ఆశపడి...రాగ
రాధిక వేరు పడి...పోగా
ఎడబాటు సహించదు హృదయము
ఒకనాటికెైన నీ జీవితాన..
కనరాకపోవు నా ఉదయము 
నిజమే తెలుసుకో గతమే తలచుకో..హేయ్

హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
మాటే మరచావే..ఏఏఏ..చిలకమ్మ
మనసువిరిచావే..ఏఏఏ

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.