ఆదివారం, మార్చి 05, 2017

పగటిపూట చంద్రబింబం...

చిక్కడు దొరకడు చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : చిక్కడు దొరకడు (1967)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సి.నారాయణరెడ్డి
గానం : పి.బి.శ్రీనివాస్, ఘంటసాల, సుశీల

విరిసిన ఇంద్ర చాపమో.. 
భువిన్ ప్రభవించిన చంద్రబింబమో
మరు పూబంతియో రతియో 
మల్లెల దొంతియో మోహ కాంతియో
సరస కవీంద్ర కల్పిత రసాకృతియో నవరాగ గీతియో.. 
వర సరసీరుహానన బిరాన వరించి తరింప జేయవే..

పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది?
అందమైన నీ మోమే అది గాకింకేది !
కాన రాని మన్మధుడేమో కనపించెను ఏడి .. ఏడి?
ఎదుటనున్న నీవేలే ఇంకా ఎవరోయి!

వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి
వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి
ఏవీ .. ఏవీ? అవి నీ సిగలోనే ఉన్నాయి
పదును పదును బాణాలెవో యెదను నాటుకుంటున్నాయి
పదును పదును బాణాలెవో యెదను నాటుకుంటున్నాయి
ఏవీ .. ఏవీ ? అవి నీ ఓర చూపులేనోయి
 
పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది ?
అందమైన నీ మోమే అది గాక ఇంకేది !

ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు
ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించెవు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించెవు
ఏమో.. ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో


2 comments:

చక్కని మాట..హృద్యమైన పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.